వైకుంఠవాసా.. శ్రీ వేంకటేశా!
వైకుంఠవాసా.. శ్రీ వెంకటేశా!
కడప సెవెన్‌రోడ్స్: వైకుంఠ ఏకాదశి సందర్భంగా జిల్లాలోని అన్ని వైష్ణవాలయాలు భక్తులతో కళకళలాడాయి. తెల్లారుజాము నుంచే భక్తులను దర్శనానికి అనుమతించారు. ప్రతి ఆలయంలో వైకుంఠ ద్వారాన్ని విశేషంగా అలంకరించి స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులను కొలువుదీర్చారు. వైకుంఠ (ఉత్తర) ద్వారం లేని ఆలయాలలో ప్రత్యేకంగా అలాంటి ద్వారం ఏర్పాటు చేసి అందులో నుంచి భక్తులకు స్వామి దర్శనభాగ్యం కల్పించారు. జిల్లాలోని ప్రముఖ వైష్ణవాలయం దేవునికడప శ్రీ లక్ష్మి వెంకటేశ్వరస్వామి ఆలయంలో వైకుంఠ ద్వారాన్ని అందంగా అలంకరించారు. అర్దరాత్రి 1.30 గంటల నుంచి దర్శనానికి అనుమతించినా అప్పటికే భక్తులు వైకుంఠ ద్వారం వద్ద దర్శనం కోసం వేచి ఉన్నారు. వైకుంఠ ద్వారంలో స్వామికి హారతులిచ్చి తొలి దర్శనం వేళకు భక్తులు పెద్ద సంఖ్యలో క్యూలో ఉన్నారు. చలి తీవ్రతకు లెక్కచేయకుండా భక్తులు అర్దరాత్రి 1 గంటకే వచ్చి క్యూలైన్లలో వేచి ఉండడం విశేషం. ఉదయం 11.30 గంటల వరకు స్వామి వారి దర్శనం కొనసాగింది. పలువురు ప్రముఖులు స్వామి దర్శనం చేసుకున్నారు.
ముక్కోటి ఏకాదశి వేళ..మురిసిన భక్తజనకోటి
వైష్ణవాలయాలకు పోటెత్తిన భక్తులు
వైకుంఠ ద్వార దర్శనం ద్వారా స్వామి దర్శనం
వైకుంఠవాసా.. శ్రీ వేంకటేశా!
వైకుంఠవాసా.. శ్రీ వేంకటేశా!


