పెన్షనర్లు లైఫ్ సర్టిఫికెట్ ఇవ్వాలి
కడప సెవెన్‌రోడ్స్: ప్రభుత్వ ఫ్యామిలీ పెన్షనర్లు జనవరి 1 నుంచి ఫిబ్రవరి 28వ తేది వరకు తమ లైఫ్ సర్టిఫికెట్‌ను డిజిటల్ విధానంలో ‘జీవన్ ప్రమాణ్’ పోర్టల్ ద్వారా సమర్పించాలని జిల్లా ఖజాన అధికారి ఎం.వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో తెలిపారు. లైఫ్ సర్టిఫికెట్ సమర్పించేందుకు ఆధార్, మొబైల్ ఫోన్, పీపీఓ నెంబరు, బ్యాంకు పాసు పుస్తకం అవసరమని పేర్కొన్నారు. ఈ వివరాలతో సంబంధిత సబ్ ట్రెజరీ కార్యాలయంలోగానీ లేదా మీ సేవా కేంద్రంలోగానీ, పెన్షనర్ల సంఘం వద్దగానీ వివరాలు అందించి లైఫ్ సర్టిఫికెట్ నమోదు చేయించుకోవాలని సూచించారు.
కడప రూరల్: వైద్య ఆరోగ్య శాఖ ప్రాంతీయ కార్యాలయం జోన్–4 పరిధిలో మంగళవారం స్థానిక జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో నిర్వహించిన కాంట్రాక్ట్ స్టాఫ్ నర్స్ నియామక కౌన్సెలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 41 మందికి గాను 36 మంది నియామక పత్రాలు పొందారు. ఈ కార్యక్రమంలో ఆ శాఖ డిప్యూటీ డైరెక్టర్ నాగరత్నమ్మ, సూపరింటెండెంట్లు శ్రీనివాసులు, వెంకటసుబ్బమ్మ, సీనియర్ అసిస్టెంట్ వనీష తదితరులు పాల్గొన్నారు.
కడప రూరల్: గర్భిణుల ఆరోగ్య పరిరక్షణకు వైద్య సిబ్బంది చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ఉమామహేశ్వర కుమార్ తెలిపారు. మంగళవారం స్థానిక ఆ శాఖ జిల్లా కార్యాలయంలోని చాంబర్‌లో మాతృమరణాలపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి హైరిస్క్ గర్భవతుల ను సకాలంలో గుర్తించి, వారిని తరచూ సీ్త్ర వ్యాధి నిపుణులకు చూపించాలన్నారు. సమస్య ఉంటే దగ్గర్లోని ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించాలన్నారు.
పెన్షనర్లు లైఫ్ సర్టిఫికెట్ ఇవ్వాలి


