బోధనా వ్యూహాలను పెంపొందించుకోవాలి | - | Sakshi
Sakshi News home page

బోధనా వ్యూహాలను పెంపొందించుకోవాలి

Jul 14 2026 4:47 AM | Updated on Jul 14 2026 4:47 AM

భువనగిరి(బీబీనగర్‌): అధ్యాపకులు సమకాలిన బోధన, అభ్యసన వ్యూహలతో పాటు సామర్థ్యాలను పెంపొందించుకోవాలని బీబీనగర్‌ ఎయిమ్స్‌ డైరెక్టర్‌ అమితా అగర్వాల్‌ అన్నారు. ఈ నెల 8 నుంచి 10వ తేదీ వరకు బీబీనగర్‌ ఎయిమ్స్‌ ఆస్పత్రిలోని నర్సింగ్‌ కళాశాలలో నూతన బోధన, అంచనా, మూల్యాంకనం, గుణాత్మక పరిశోధన అనే అంశంపై ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ సందర్భంగా సోమవారం ఆస్పత్రిలో వినూత్న పద్ధతుల ద్వారా విద్యార్థులకు బోధించారు. అధ్యాపకులకు ఎఫ్‌డీపీ ద్వారా అందించిన నైపుణ్యాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. శిక్షణ పొందిన అధ్యాపకులకు సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో నర్సింగ్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ టి.లత, ప్రొఫెసర్‌ రఫత్‌, ట్యూటర్‌ గురు, పీటర్‌, లక్ష్మసారా తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement