స్థానికంలో సత్తా చాటుదాం | - | Sakshi
Sakshi News home page

స్థానికంలో సత్తా చాటుదాం

Sep 6 2026 2:13 AM | Updated on Sep 6 2026 2:13 AM

న్యూస్‌రీల్‌

జిల్లాలో పటిష్టంగా పార్టీ: ప్రసాదరాజు

ఆదివారం శ్రీ 6 శ్రీ సెప్టెంబర్‌ శ్రీ 2026

సాక్షి, భీమవరం: రానున్న స్థానిక ఎన్నికల సమరంలో గెలుపే లక్ష్యంగా వైఎస్సార్‌సీపీ అడుగులు వేస్తోంది. చంద్రబాబు సర్కారు వైఫల్యాలను ప్రజాక్షేత్రంలో ఎండగట్టి, జగన్‌ హయాంలో జరిగిన మేలును ప్రజలకు వివరించేందుకు కార్యాచరణ సిద్ధం చేసింది. పార్టీ కేడర్‌లో నూతనోత్సాహాన్ని నింపుతూ జిల్లాలో గుర్తింపు కార్డుల పంపిణీని పార్టీ నేతలు ప్రారంభించారు. రానున్న వారం రోజుల్లో నియోజకవర్గ, మండల, గ్రామ స్థాయిలో పార్టీ నేతలు, కార్యకర్తలు అందరికీ కార్డులు అందజేయనున్నారు. పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశా ల మేరకు పార్టీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు అధ్యక్షతన శనివారం భీమవరంలోని కార్యాలయంలో జిల్లాస్థాయి సమావేశం నిర్వహించారు. పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, పార్లమెంట్‌ పరిశీలకుడు ముదునూరి మురళీకృష్ణంరాజు, పార్లమెంట్‌ ఇన్‌చార్జి గూడూరి ఉమాబాల, మాజీ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు, నియోజకవర్గ సమన్వయకర్తలు వడ్డి రఘురాంనాయుడు (తాడేపల్లిగూడెం), చినమిల్లి వెంకటరాయుడు (భీమవరం), మంతెన యోగీంద్రబాబు (ఉండి), గుడాల శ్రీహరిగోపాల రావు (పాలకొల్లు) హాజరయ్యారు. ఈ సందర్భంగా మున్సిపల్‌, పంచాయతీలతో పాటు మండల, జిల్లాపరిషత్‌ ఎన్నికలు ఎప్పుడొచ్చినా సత్తా చాటేందుకు పార్టీ కేడర్‌ సిద్ధంగా ఉండాలని నేతలు పిలుపునిచ్చారు.

కూటమి కుట్రలు తిప్పికొట్టాలి: మురళీకృష్ణంరాజు

స్థానిక ఎన్నికల్లో గెలుపుకోసం కూటమి కుట్రలు కుతంత్రాలు చేస్తుందని, వాటిని పార్టీ ప్రతినిధులు సమర్థవంతంగా తిప్పికొట్టాలని పార్లమెంట్‌ పరిశీలకుడు ముదునూరి మురళీకృష్ణంరాజు అన్నారు. అధినేత జగన్‌ ఆదేశాల ప్రకారం ప్రతి స్థానంలో సమర్థులైన వారిని బరిలో నిలిపి వారి విజయంలో కీలకంగా వ్యవహరించాలని సూచించారు. అందుకు అవసరమైన కార్యాచరణను ఇప్పటినుంచే సిద్ధం చేసుకోవాలని పార్టీ నేతలకు పిలుపునిచ్చారు.

గుర్తింపు కార్డులు అభినందనీయం: ఉమాబాల

కార్యకర్తలకు గుర్తింపు కార్డుల జారీ అభినందనీయమని పార్లమెంట్‌ సమన్వయకర్త ఉమాబాల అన్నారు. వీటి ద్వారా కార్యకర్తలకు సమాజంలో గుర్తింపుతో పాటు ప్రభుత్వం, అధికార యంత్రాంగం అవినీతి, అక్రమాలను ధైర్యంగా ఎండగట్టేందుకు వీలుంటుందన్నారు. వైఎస్సార్‌సీపీ కేడర్‌ పట్ల అధికారుల్లో జవాబుదారీతనం ఉంటుందన్నారు.

కార్యకర్తలే కొండంత బలం: శ్రీరంగనాథరాజు

వైఎస్సార్‌సీపీకి కార్యకర్తలే కొండంత బలమని మాజీ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు అన్నారు. పార్టీ అధికారంలో ఉన్నా, లేకున్నా కేడర్‌ ఎప్పుడు జగన్‌ వెంటే ఉంటారన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో సత్తాచాటడమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా పనిచేయాలని కోరారు.

విజయావకాశాలు మెండు: రఘురాం

స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి విజయావకాశాలు మెండుగా ఉన్నాయని తాడేపల్లిగూడెం సమన్వయకర్త వడ్డి రఘురాంనాయుడు అన్నారు. ఎన్నికల హామీలను అమలుచేయకుండా మోసం చేసిన కూటమిపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, స్థానిక ఎన్నికల్లో ఆ పార్టీలను చిత్తుగా ఓడించడం ఖాయమని స్పష్టం చేశారు.

అందరికీ గుర్తింపు కార్డులు: వెంకటరాయుడు

పార్టీలో గ్రామం నుంచి రాష్ట్రస్థాయి వరకు వివిధ హోదాల్లో ఉన్న వారందరికీ అధిష్టానం నుంచి గుర్తింపు కార్డులు వచ్చాయని భీమవరం సమన్వయకర్త చినమిల్లి వెంకటరాయుడు అన్నారు. ఇంకా ఎక్కడైనా కార్డులు రాని వారు తమ దృష్టికి తీసుకువస్తే వాటిని రప్పించేందుకు కృషి చేస్తామని చెప్పారు.

ప్రజలంతా జగన్‌ వైపే.. యోగీంద్రబాబు

సూపర్‌ సిక్స్‌ అంటూ అధికారంలోకి వచ్చిన కూ టమి ప్రజలను దారుణంగా వంచించిందని ఉండి సమన్వయకర్త మంతెన యోగీంద్రబాబు అన్నారు. ప్రభుత్వం ఎన్నికల హామీలను గాలికొదిలేసి అ రాచక పాలన సాగిస్తోందన్నారు. ప్రజలు మళ్లీ జ గన్‌ పాలనను కోరుకుంటున్నారని, స్థానిక ఎ న్నికల్లో వైఎస్సార్‌సీపీ గెలుపు ఖాయమన్నారు.

వెన్నుపోటు పార్టీకి గుణపాఠం: గోపి

బూత్‌ నుంచి మండల, జిల్లా, రాష్ట్రస్థాయి హోదాల్లో ఉన్న వారందనీ సమన్వయం చేసుకుంటూ పార్టీని మరింత బలోపేతం చేసుకునేందుకు చేస్తున్న ఈ ప్రయత్నంలో అందరూ చురుగ్గా పాల్గొనాలని పాలకొల్లు సమన్వయకర్త గుడాల గోపి అన్నారు. ఎన్నికల్లో వెన్నుపోటు పార్టీకి తగిన గుణపాఠం చెప్పాలన్నారు.

ఈ కార్యక్రమంలో ఎస్‌ఈసీ సభ్యుడు పెండ్ర వీరన్న, రాష్ట్ర కార్యదర్శి పేరిచర్ల నరసింహరాజు, బీసీ సెల్‌ రాష్ట్ర కార్యదర్శి కోడే యుగంధర్‌, మహిళ విభాగం జిల్లా అధ్యక్షురాలు కోడే విజయలక్ష్మి, భీమవరం అర్బన్‌ అధ్యక్షుడు గాదిరాజు రామరాజు, మహిళ విభాగం రాష్ట్రకార్యదర్శి పాలవెల్లి మంగ, జిల్లా అధికార ప్రతినిధులు, రాష్ట్ర, జిల్లాస్థాయిలో అనుబంధ విభాగాల నేతలు పాల్గొన్నారు.

వైఎస్సార్‌సీపీ గుర్తింపు కార్డులను ప్రదర్శిస్తున్న నాయకులు

భీమవరంలో జరిగిన సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా అధ్యక్షుడు ప్రసాదరాజు, చిత్రంలో మురళీకృష్ణంరాజు, ఉమాబాల, శ్రీరంగనాథరాజు, రఘురాం నాయుడు, యోగీంద్రబాబు, వెంకటరాయుడు

గెలుపే లక్ష్యం

భీమవరంలో వైఎస్సార్‌సీపీ జిల్లాస్థాయి సమావేశం

పార్టీ కేడర్‌కు గుర్తింపు కార్డుల పంపిణీ ప్రారంభం

స్థానిక సంస్థల ఎన్నికలకు కార్యాచరణ

వచ్చే వారంలో నియోజకవర్గ, మండల, గ్రామస్థాయిలో సమావేశాలు

గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్రస్థాయిలో జిల్లావ్యాప్తంగా 25 వేలకుపైగా ప్రతినిధులతో జిల్లాలో వైఎస్సార్‌సీపీ బలోపేతంగా ఉందని జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు అన్నారు. వీరందరికీ పార్టీ ఈనెల 8, 9, 10 తేదీల్లో నియోజకవర్గ స్థాయిలో, 11, 12, 13 తేదీల్లో మండల, గ్రామస్థాయిల్లో సమావేశాలు నిర్వహించి గుర్తింపుకార్డులు అందజేయాల్సి ఉందన్నారు. ఓటర్లు నష్టపోకుండా సర్‌ ప్రోగ్రామ్‌ పూర్తయ్యాక ఎన్నికలు జరపాలని వైఎస్సార్‌సీపీ కోరుతుంటే, ఎన్నికలు అడ్డుకుంటున్నారంటూ కూటమి ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తోందని విమర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement