గూడెంలో జనసేనకు షాక్‌ | - | Sakshi
Sakshi News home page

గూడెంలో జనసేనకు షాక్‌

Sep 7 2026 7:33 AM | Updated on Sep 7 2026 7:33 AM

తాడేపల్లిగూడెం: తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో జనసేన పార్టీకి పెద్దషాక్‌ తగిలింది. తాడేపల్లిగూడెం మండలం పడాల గ్రామానికి చెందిన జనసేన నాయకులు పెద్ద సంఖ్యలో ఆదివారం వైఎస్సార్‌సీపీ గూడెం నియోజకవర్గ కన్వీనర్‌ వడ్డి రఘురాం ఆధ్వర్యంలో సవితృపేటలోని క్యాంపు కార్యాలయంలో వైఎస్సార్‌సీపీ తీర్థం పుచ్చుకున్నారు. పూర్వం పీఆర్‌పీలో, ప్రస్తుతం జనసేనలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న కామిశెట్టి మురళీ, ఆదూరి దుర్గాప్రసాద్‌, చవ్వాకుల గణేష్‌ల ఆధ్వర్యంలో రఘురాం సమక్షంలో పార్టీలోకి వచ్చారు. వైఎస్సార్‌సీపీలో నాయకులు, కార్యకర్తలు అంతా ఒక కుటుంబం వంటి వారని, ఎవరికి ఏం కష్టమొచ్చినా ఆదుకొనేందుకు అందరూ సంసిద్ధంగా ఉంటారని, నియోజకవర్గంలో శ్రేణులకు ఏం అవసరం వచ్చినా తనతో పాటు పార్టీ అండగా ఉంటుందని రఘురాం అన్నారు. పార్టీ పట్టణ అధ్యక్షుడు గొర్రెల శ్రీనివాసు, మండలాల నాయకులు పాల్గొన్నారు.

వైఎస్సార్‌సీపీలో భారీగా చేరికలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement