గోదావరిలో మూడు మృతదేహాలు లభ్యం
తణుకు అర్బన్ : తణుకులో పాల వ్యాపారి నంబూరి శ్రీనివాస్, పద్మిని, పిల్లలు ఈశ్వర్, నిత్యశ్రీ సహా బలవన్మరణానికి యత్నించిన ఘటన తణుకులో సంచలనం రేకెత్తించింది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా భార్యాభర్తలు పిల్లలతో సహా చనిపోయేంత ధైర్యం చేశారంటే వారు ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నారోనని ప్రజానీకం చర్చించుకుంటుండగా, మరికొందరు మాత్రం పిల్లలు ఏం చేశారని వారిని కూడా ఎందుకు తీసుకుపోయారంటూ నిందిస్తున్నారు. శనివారం ఉదయం చించినాడ బ్రిడ్జిపై నుంచి దూకి గల్లంతైన శ్రీనివాస్, ఈశ్వర్, నిత్యశ్రీల మృతదేహాలు ఆదివారం గజ ఈతగాళ్లు, ఎన్‌ఆర్‌ఎఫ్ బృందాల గాలింలో లభ్యంకాగా, దూకిన వెంటనే జాలర్లు కాపాడిన పద్మిని ఆరోగ్యస్థితి ఇప్పటికీ విషమంగానే ఉన్నట్టు బంధువులు చెబుతున్నారు. తణుకులోని సీ్త్రసమాజం రోడ్డులోని దుకాణంలో పాల వ్యాపారంతోపాటు కిరాణా వ్యాపారం కూడా నిర్వహిస్తుండగా, వ్యాపారం ఆశించిన మేర లాభసాటిగా లేకపోవడంతో కుటుంబపోషణ బరువై అప్పు లు చేసినట్టు సమాచారం. ఈ క్రమంలో చేసిన అ ప్పుల తాలూకా వడ్డీ నెలకు సుమారుగా రూ.20 వేల వరకు కట్టాల్సి వస్తుండగా పద్మిని తల్లి శ్రీహరి ఇంటిని సైతం కుదవపెట్టి రూ.2.60 లక్షల వరకు అప్పు ఉండటంతో తప్పని పరిస్థితుల్లోనే బలవన్మరణానికి పాల్పడాల్సి వచ్చినట్టు బంధువులు చెబుతున్నారు. మృతదేహాలకు పోస్టుమార్టం అనంతరం పాలకొల్లులో అంత్యక్రియలు నిర్వహించారు.
వడ్డీల భారం
దుకాణం వద్ద చీటీలతోపాటు టెండర్ల విధానంలో డబ్బులు ఇచ్చిన వారి ఒత్తిడి అధికం కావడంతో నాలుగు రోజులుగా శ్రీనివాస్ దుకాణం సైతం తెరవని పరిస్థితి. శుక్రవారం దుకాణం తెరచినా శనివారం ఉదయం ఆత్మహత్యకు పాల్పడటం కూడా ఆశ్చర్యపరిచింది. రోజూ సాయంత్రం వడ్డీ వ్యాపారుల తాకిడి పెరగడంతో ఈ దారుణానికి ఒడిగట్టినట్లుగా తెలుస్తోంది. ఎదిగిన పిల్లలను సైతం చనిపోవాలంటూ ఒప్పించిన తీరు సైతం బంధువర్గాన్ని కంటనీరు పెట్టిస్తోంది. పద్మిని తల్లి శ్రీహరి ఇంటి కాగితాలు కుదువపెట్టామని కె.శివప్రసాద్ అనే వ్యక్తి వద్ద మీ కాగితాలు ఉన్నాయని విడిపించుకోమంటూ రాసిన లేఖ తీవ్ర దుమారం లేపింది. శివప్రసాద్ ఎవరు ఫైనాన్షియరా అనే కో ణం బయటకు రావడంతో ఈ ఫైనాన్షియర్‌తో పాటు అధిక వడ్డీలకు డబ్బులు ఇస్తున్న వారి కా రణంగా ఈ బలవన్మరణానికి పాల్పడ్డారా అనే అ నుమానాలు వ్యక్తమవుతున్నాయి. కుటుంబంలో ప్రస్తుతం పద్మిని తల్లి శ్రీహరికి మాత్రమే ఈ ఆర్థిక లావాదేవీలు కొంతమేర తెలిసి ఉండగా, పద్మిని కూడా పూర్తి ఆరోగ్యంగా బయటపడితే వడ్డీ వ్యాపారులకు సంబంధించిన వ్యవహారం పూర్తిగా బయటపడే పరిస్థితి ఉందనే చర్చ జరుగుతోంది. అప్పులు రూ.లక్షల్లో ఉండే అవకాశం ఉందని తెలిసింది. ఒత్తిళ్లకు సంబంధించి ఫిర్యాదులు అందితే పోలీసుల దర్యాప్తులో పూర్తిస్థాయిలో నిజనిజాలు బయటపడనున్నాయి.
వడ్డీలు కట్టలేక.. అప్పులు తీర్చలేక..
నెలకు రూ.20 వేలకు పైగా వడ్డీల కట్టుబడి
అంతంతమాత్రంగా ఆదాయం
పాల వ్యాపారి కుటుంబం ఆత్మహత్యాయత్నం
తండ్రి, ఇద్దరు బిడ్డలు మృతి
విషమంగా తల్లి పరిస్థితి
యలమంచిలి: తణుకుకి చెందిన నంబూరి శ్రీనివాస్ (45), ఆయన కుమారుడు ఈశ్వర్ (16), కుమార్తె నిత్యశ్రీ (14) శనివారం చించినాడ వద్ద వశిష్ట గో దావరిలో దూకి గల్లంతైన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ముగ్గురి మృతదేహాలు ఆదివారం గోదావరిలో లభ్యమయ్యాయి. గోదావరిలో కొత్తగా నిర్మిస్తున్న రైల్వే వంతెన సమీపంలో మృతదేహాలు పైకి తేలాయని ఎస్సై మోటూరి రాజ్‌కుమార్ తెలిపారు. మృతదేహాలకు శవపంచనామా, పాలకొల్లు ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించినట్టు చెప్పారు. ఈ ఘటనలో ప్రాణాలతో బయటపడిన పద్మిని ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పద్మిని తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పాలకొల్లు రూరల్ సీఐ గుత్తుల శ్రీనివాస్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


