మామిడిశెట్టి కథకు బహుమతి | - | Sakshi
Sakshi News home page

మామిడిశెట్టి కథకు బహుమతి

Sep 7 2026 7:33 AM | Updated on Sep 7 2026 7:33 AM

మామిడిశెట్టి కథకు బహుమతి నేడు యథావిధిగా పీజీఆర్‌ఎస్‌ 27న శతాధిక వృద్ధుల సన్మానోత్సవం మానవత్వం చాటిన మాజీ ఎమ్మెల్యే ప్రతాప్‌ అప్పారావు 10న జాబ్‌మేళా

యలమంచిలి : ఖమ్మంకి చెందిన వురిమళ్ల ఫౌండేషన్‌ నిర్వహించిన జాతీయస్థాయి కథల పోటీలు–2026లో పాలకొల్లు రసధుని సాహితీ సంస్థ కార్యదర్శి, కవి మామిడిశెట్టి శ్రీనివాసరావు రాసిన ‘ఏ వెలుగులకీ ప్రస్థానం’ కథ కన్సొలేషన్‌ బహుమతి గెలుచుకుంది. ఉభయ రాష్ట్రాల నుంచి 315 కథలు రాగా ఈ కథ నాలుగో స్థానంలో నిలిచింది. వ్యవసాయంలో అప్పులు పాలైన రైతుల దీనస్థితి ఇతివృత్తంగా ఈ కథ సాగింది. శ్రీనివాసరావుని రసధుని అ ధ్యక్షుడు కొట్టి భాస్కరరావు, పాలకవర్గ సభ్యులు యర్రంశెట్టి వెంకటరత్నం, వంగా నరసింహారావు, ఎన్జీఓ నాయకులు గుడాల హరిబాబు, వెంకటపతి వర్మ, జీఎస్‌ఎన్‌ మూర్తి తదితరులు అభినందించారు.

భీమవరం (ప్రకాశంచౌక్‌) : ప్రజాసమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్‌)ను సోమవారం భీమవరం కలెక్టరేట్‌తో పాటు డివిజన్‌, మండల కేంద్రాల్లో నిర్వహించనున్నట్టు కలెక్టర్‌ సీహెచ్‌ నాగరాణి తెలిపారు. అలాగే రెవెన్యూ సమస్యల పరిష్కారానికి రెవెన్యూ క్లినిక్‌ కూడా నిర్వహిస్తామన్నారు. ప్రజలు నేరుగా వెబ్‌సైట్‌, టోల్‌ఫ్రీ 1100 ద్వారా కూడా అర్జీలు సమర్పించవచ్చని సూచించారు.

15లోపు నమోదు చేసుకోవాలి

మధురానగర్‌ (విజయవాడసెంట్రల్‌) : అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం పురస్కరించుకుని వయోవృద్ధ చారిటబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యాన ఈనెల 27న నిర్వహించనున్న శతాధిక వృద్ధుల సన్మానోత్సవానికి శతాధిక వృద్ధులు ఈనెల 15వ తేదీలోపు నమోదు చేసుకోవాలని ట్రస్ట్‌ చైర్మన్‌ డాక్టర్‌ చల్లా హరికుమార్‌, వైస్‌ చైర్మన్‌ తేజ్‌రాజ్‌ సోలంకి కోరారు. విజయవాడలో ఆదివారం నిర్వహించిన మీడిమా సమావేశంలో మాట్లాడుతూ ఉమ్మడి కృష్ణా, ఉమ్మడి గుంటూరు, ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాల కు చెందిన శతాధిక వృద్ధులను గుర్తించి సత్కరించనున్నట్లు తెలిపారు. శతాధిక వృద్ధులు ఈ నెల 15లోపు తమను సెల్‌ 93475 72766, 98481 11138 నంబర్లలో సంప్రదించాల్సిందిగా వారు కోరారు. ఎంపిక చేసిన శతాధిక వృద్ధులను ట్రస్ట్‌ సొంత ఖర్చులతో విజయవాడ తీసుకువచ్చి సత్కారం నిర్వహించి తిరిగి వారి ఇంటి వద్ద దింపివేయనున్నట్లు పేర్కొన్నారు.

ప్రమాద బాధితునికి తక్షణ సాయం

ముసునూరు : ప్రమాదంలో ఉన్న వ్యక్తి పట్ల పెద్ద మనసుతో స్పందించి మరో పర్యాయం మానవత్వం చాటుకున్నారు నూజివీడు మాజీ ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్‌ అప్పారావు. ఆదివారం రాత్రి ముసునూరు మండలం లో పూడి శివారు బాసవరప్పాడులో ఓ శుభకార్యానికి హాజరై తిరిగి వస్తుండగా చింతలవల్లి శి వారు గోగులంపాడు పెద్ద చెరువు సమీపంలో గ్రామానికి చెందిన గంగుల కాసులు ప్రమాదవశాత్తు గాయాలతో రోడ్డు పక్కన పడి ఉండటాన్ని ఆయన గమనించారు. తక్షణమే స్పందించి కారు ఆపించి, గాయపడిన వ్యక్తి దగ్గరకు వెళ్లారు. గాయాల తీవ్రతను గమనించి తక్షణ మే వాహనం రప్పించే ఏర్పాటు చేయించారు. క్షతగాత్రుడిని ఆస్పత్రికి వాహనంలో తరలించే వరకూ అక్కడే ఉండి మానవత్వం చాటుకున్నారు. ఆయన్ను పలువురు అభినందించారు.

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): జంగారెడ్డిగూడెంలో ఈనెల 10న జాబ్‌మేళా నిర్వహించనున్నట్టు జి ల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఎన్‌.జితేంద్రబా బు ఆదివారం ప్రకటనలో తెలిపారు. జంగారెడ్డిగూడెం రామచంద్ర డిగ్రీ కాలేజీలో జరిగే జా బ్‌మేళాలో సుమారు 13 కంపెనీల ప్రతినిధులు పాల్గొంటారని, అలాగే సుమారు 650 మంది ఉద్యోగావకాశాలు కల్పిస్తారన్నారు. టెన్త్‌, ఇంటర్‌, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, ఎంబీఏ, పీజీ, బీటెక్‌ వంటి విద్యార్హతలు ఉండి 18–35 ఏళ్ల వయసున్న వారు అర్హులన్నారు. మరిన్ని వివరాలకు సెల్‌ 7095386433, 96525 03799తో పాటు టోల్‌ఫ్రీ 9988853335లో సంప్రదించవచ్చన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement