డయాబెటిస్‌.. హైపర్‌టెన్షన్‌ | - | Sakshi
Sakshi News home page

డయాబెటిస్‌.. హైపర్‌టెన్షన్‌

Aug 8 2026 1:17 AM | Updated on Aug 8 2026 1:17 AM

డయాబెటిస్‌.. హైపర్‌టెన్షన్‌

ఏడాదిలో ఎంత పెరిగాయంటే..

సాక్షి, వరంగల్‌: జిల్లాలో డయాబెటిస్‌, హైపర్‌టెన్షన్‌ వ్యాధులు కలవరపెడుతున్నాయి. ఒకప్పుడు 50 ఏళ్లు దాటితేనే వచ్చే వ్యాధులుగా భావించిన మధుమేహం (డయాబెటిస్‌), రక్తపోటు (హైపర్‌టెన్షన్‌).. ఇప్పుడు 30 నుంచి 40 ఏళ్ల వయస్సులోనే చాలామందిని చుట్టుముడుతున్నాయి. ఆహారపు అలవాట్లలో మార్పులు, శారీరక శ్రమ తగ్గడం, ఒత్తిడి, ఊబకాయం, నిద్రలేమి, కుటుంబ సంబంధిత కారణాలు అసంక్రమిక వ్యాధులను వేగంగా వ్యాప్తి చేస్తున్నాయి. జిల్లాలో గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఇప్పటికే మధుమేహం కేసులు 1,136, రక్తపోటు కేసులు 1,377 పెరగడం ఆందోళన కలిగిస్తోంది.

గ్రామం నుంచి నగరం వరకు సర్వే..

ప్రతిఏటా అసంక్రమిత వ్యాధుల నివారణ పేరుతో గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో వైద్యారోగ్యశాఖ సర్వే నిర్వహిస్తోంది. రక్తపోటు, మధుమేహంతో బాధపడే వారిని గుర్తించి సమీప ప్రాథమిక, పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో వైద్యులు తగిన వైద్యం అందిస్తున్నారు. రోగులకు నెలకు సరిపడా మందులను ఉచితంగా అందజేస్తున్నారు.

ఈ లక్షణాలు ఉంటే ఆలస్యం చేయొద్దు

డయాబెటిస్‌: తరచూ దాహం వేయడం, ఎక్కువగా మూత్రం రావడం, బరువు తగ్గడం, త్వరగా అలసిపోవడం, చూపు మసకబారడం

నిర్లక్ష్యం చేస్తే: మధుమేహం నిశ్శబ్దంగా కిడ్నీలు, కళ్లు, గుండె, నరాలపై ప్రభావం చూపుతుంది.

రక్తపోటు: తలనొప్పి, తల తిరగడం, గుండె వేగంగా కొట్టుకోవడం, ఛాతిలో బరువుగా అనిపించడం, కొన్నిసార్లు ఎలాంటి లక్షణాలూ ఉండకపోవడం

నిర్లక్ష్యం చేస్తే: గుండెపోటు, పక్షవాతం, మూత్రపిండాల సమస్యలు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

రోగులకు సరిపడా మందులు ఇస్తున్నాం..

షుగర్‌, బీపీ వచ్చాక చికిత్స కంటే.. రాకముందే జీవనశైలిని మార్చుకోవడం ఉత్తమ ఔషధం. ప్రస్తుతం జిల్లాలో పెరుగుతున్న గణాంకాలు చూస్తే ప్రతీ కుటుంబం కనీసం సంవత్సరంలో ఒకసారి రక్తంలో చక్కెర, రక్తపోటు పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రభుత్వం కూడా ఉచిత వైద్య పరీక్షలు చేయడంతో పాటు నెలకు సరిపడా మందులు ఇస్తోంది.

– రాజారెడ్డి, డీఎంహెచ్‌ఓ

డయాబెటిస్‌ హైపర్‌టెన్షన్‌

జిల్లాలో పెరుగుతున్న మధుమేహం, రక్తపోటు కేసులు

మారుతున్న జీవనశైలితో అసంక్రమిత వ్యాధుల ముప్పు

వయస్సుతో సంబంధం లేకుండా వెంటాడుతున్న షుగర్‌, బీపీ

ఆరోగ్య నియమాలు పాటించాలంటున్న వైద్యులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement