పోలీసులు అంకితభావంతో పనిచేయాలి | - | Sakshi
Sakshi News home page

పోలీసులు అంకితభావంతో పనిచేయాలి

Aug 9 2026 2:34 AM | Updated on Aug 9 2026 2:34 AM

పోలీసులు అంకితభావంతో పనిచేయాలి

పర్యావరణాన్ని బాధ్యతగా పరిరక్షించాలి

డీజీపీ సీవీ ఆనంద్‌

మామునూరు బెటాలియన్‌లో పోలీసు అధికారుల ఘన స్వాగతం

మామునూరు: స్పెషల్‌ పోలీసులు రాష్ట్ర అంతర్గత భద్రతను పరిరక్షిస్తూ అంకితభావం, క్రమశిక్షణతో విధులు నిర్వర్తించాలని రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్‌ సూచించారు. మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలని, ఎస్డీఆర్‌ఎఫ్‌ సామర్థ్యాలను మరింతగా అభివృద్ధి చేసుకోవాలని డీజీపీ పేర్కొన్నారు. వరంగల్‌ పర్యటనలో భాగంగా శనివారం సాయంత్రం మామునూరు టీజీ ఎస్పీ నాలుగో బెటాలియన్‌ను అడిషనల్‌ డీజీపీ సంజయ్‌కుమార్‌ జైన్‌తో కలిసి డీజీపీ సందర్శించారు. బెటాలియన్‌ ప్రధాన గేట్‌ వద్దకు చేరుకున్న ఆయనకు కమాండెంట్‌ డి.శివప్రసాద్‌రెడ్డి, ఉన్నతాధికారులు పుష్పగుచ్ఛాలు అందించి ఘనంగా సన్మానించారు.

అధికారులతో ముఖాముఖి

బెటాలియన్‌ ఆడిటోరియంలో జరిగిన అధికారులు, సిబ్బందితో ముఖాముఖి కార్యక్రమంలో డీజీపీ సీవీ ఆనంద్‌ మాట్లాడుతూ.. ప్రజలకు మెరుగైన సేవలందించాలని, బెటాలియన్‌లో మరిన్ని మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణను ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలన్నారు. పోలీసింగ్‌ను మరింత పటిష్టం చేసేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఎస్డీఆర్‌ఎఫ్‌ (స్టేట్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ ఫోర్స్‌) సిబ్బంది ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ వృత్తి నైపుణ్యం, సాంకేతిక పరిజ్ఞాన, సమన్వయాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. అంతకు ముందు బెటాలియన్‌లో మొక్కలు నాటారు. తర్వాత ఎస్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది రెస్క్యూ పరికరాలను పరిశీలించి, నైపుణ్యాన్ని డీజీపీ అభినందించారు. కార్యక్రమంలో బెటాలియన్‌ అసిస్టెంట్‌ కమాండెంట్లు బాలయ్య, వీరన్న, రాజేందర్‌, ఆర్‌ఐలు కార్తీక్‌, విజయ్‌, రవి, పురుషోత్తంరెడ్డి, వెంకటేశ్వర్లు, రాజ్‌కుమార్‌, కృష్ణ, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement