నర్సంపేట: బీఆర్‌ఎస్ అధ్యక్షుడు, మాజీ సీఎం కేసీఆర్ ఆదివారం వరంగల్ జిల్లా నల్ల బెల్లిలోని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి ఇంటికి రానున్నారు. పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని ఆదుకునేందుకు కేసీఆర్ ఇప్పటికే ఆర్థిక సాయం ప్రకటించిన విషయం విదితమే.
కిరాణా షాపులో
ఎన్‌ఫోర్స్‌మెంట్ తనిఖీలు
నర్సంపేట రూరల్: గుడుంబా తయారీకి ఉపయోగించే నిషేధిత ఈస్ట్ పౌడర్ ప్యాకెట్లను అక్రమంగా నిల్వ చేశారన్న సమాచారం మేరకు ఎకై ్సజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ మేరకు ఓ కిరాణా షాపులో 38 ప్యాకెట్ల ఈస్ట్ పౌడర్, 40కిలోల చక్కెరను స్వాధీనం చేసుకొని షాపు యాజమానిపై కేసు నమోదు చేసినట్లు ఎకై ్సజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఎస్సై రజితరెడ్డి తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం నర్సంపేట పట్టణంలోని వెంకటేశ్వర కిరాణం అండ్ జనరల్ స్టోర్స్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్ పోలీసులు దాడులు నిర్వహించి నిషేధిత ఈస్ట్ పైడర్ స్వాధీనం చేసుకుని, షాపు యాజమానిపై కేసు నమోదు చేసినట్లు వివరించారు.
మరో స్వాతంత్య్ర పోరాటానికి సిద్ధం కావాలి
హసన్‌పర్తి: భారత రాజ్యాంగాన్ని, ప్రభుత్వ రంగ సంస్థను రక్షించుకోవడానికి మరో స్వాతంత్య్ర పోరాటానికి సిద్ధం కావాలని సీపీఐ జాతీయ నాయకుడు చాడా వెంకట్‌రెడ్డి పిలుపునిచ్చారు. సీపీఐ చేపట్టిన ప్రచార యాత్ర శనివారం హసన్‌పర్తి మండల కేంద్రానికి చేరుకుంది. ఈసందర్భంగా జరిగిన సమావేశంలో సీపీఐ జాతీయ నాయకుడు చాడా వెంకట్‌రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రంలోని మోదీ సర్కార్ పేద ప్రజల వ్యతిరేక విధానాలకు పాల్పడుతోందని ఆరోపించారు. రెండు లక్షల కోట్ల అప్పులు చేసి దేశ సంపదను పెట్టుబడిదారీ వర్గానికి దోచి పెట్టాడని ఆరోపించారు. దోపీడీ వర్గానికి వ్యతి రేకంగా యువత కార్మికవర్గం తిరుగుబాటుకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. వికసిత్ భారత్ పేరుతో దేశాన్ని విభజిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు.
సెప్టెంబర్ 1న చలో ఢిల్లీ
ఈనెల 14వ తేదీ వరకు ప్రచార యాత్రను కొనసాగించాలని చాడా వెంకట్‌రెడ్డి సూచించారు. సెప్టెంబర్ 1న చలో ఢిల్లీ కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. కార్యదర్శి మెట్టు శ్యాంసుందర్ అధ్యక్షతన జరిగిన ఈకార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి కర్రె భిక్షపతి, సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు జ్యోతి, మోతె లింగారెడ్డి, శ్రీనివాస్, మండ సదాలక్ష్మి, జిల్లా సహాయ కార్యదర్శి మిద్దెల ఎల్లేశ్, తోట భిక్షపతి, లక్ష్మణ్, రాజమౌళి పాల్గొన్నారు.
ఏఐసీసీ చీఫ్‌ను కలిసిన డాక్టర్ రామకృష్ణ
హన్మకొండ చౌరస్తా: త్వరలో జరగనున్న వరంగల్–ఖమ్మం–నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానా నికి పోటీచేసే అవకాశం ఇవ్వాలని కోరుతూ హనుమకొండకు చెందిన డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ శనివారం ఢిల్లీలో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మల్లికార్జునఖర్గే, కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ను కలిశారు. రామకృష్ణ చారి టబుల్ ట్రస్ట్ చైర్మన్‌గా, పార్టీలో సీనియర్‌గా వరంగల్ నియోజకవర్గం, క్షేత్రస్థాయిలో పార్టీ బలో పేతం కోసం చేస్తున్న కృషిని వారికి వివరించారు. అంతేకాకుండా పలు రాష్ట్రాల్లో ఎన్నికల పరిశీలకులుగా పనిచేసిన అనుభవాన్ని వారి దృష్టికి తీసుకెళ్లారు. ఎస్సీ సామాజికవర్గానికి చెందిన తన తాత, తండ్రి సైతం కాంగ్రెస్ పార్టీగా విధేయుడిగా ఉన్న ట్లు తెలిపారు. దశాబ్దానికి పైగా పార్టీ కోసం శ్ర మిస్తున్న తనకు పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా అ వకాశం కల్పించాలని కోరారు. ప్రభుత్వంలో భాగమయ్యే కార్పొరేషన్ చైర్మన్ పదవితోనైనా ప్రజలకు మరింత చేరువవుతానని తెలిపారు. పార్టీకి చేసిన సేవలను గుర్తించి తనకు కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇవ్వాలని మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు 30 లేఖలు సిఫారసు చేశానని రామకృష్ణ వారికి వినతిపత్రం అందజేశారు.


