వరంగల్‌లో వేడుకలు..
వరంగల్ కాశిబు గ్గ తిలక్‌రోడ్డులో శ్రీజగన్మాత మహిళా పరపతి సంఘం సభ్యులు శనివారం గోరింటాకు వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. మహిళలు సేకరించిన గోరింటాకుతో ఒక్క చోట చేరి రోలులో వేసి రుబ్బారు. రుబ్బుతున్న సమయంలో లయబద్ధంగా గౌరమ్మను కీర్తిస్తూ పాటలు పాడారు. వాయినాలు ఇచ్చుకున్నారు. తాంబూలాలు, స్వీట్లు పంచుకున్నారు. సంతోషంతో ఒకరికొకరు చేతులు, కాళ్లకు మైదాకు పెట్టుకున్నారు. ఫొటోలు దిగి సందడి చేశారు. ప్రతీ సంవత్సరం ఇలాగే సంతోషంగా గోరింటాకు వేడుకలు జరుపుకుంటామని సంఘం సభ్యులు చెబుతున్నారు.


