కళాశాల విద్యార్థులకు నోట్‌బుక్స్‌ పంపిణీ | - | Sakshi
Sakshi News home page

కళాశాల విద్యార్థులకు నోట్‌బుక్స్‌ పంపిణీ

Aug 8 2026 1:17 AM | Updated on Aug 8 2026 1:17 AM

డబ్బులు తీసుకుంటే తొలగింపే

కాళోజీ సెంటర్‌: రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల ఈ విద్యా సంవత్సరం నుంచి అన్ని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో అనూహ్యమైన మార్పులు వస్తున్నాయని డీఐఈఓ శ్రీధర్‌ సుమన్‌ తెలిపారు. విద్యార్థులు ఉచితంగా పాఠ్యపుస్తకాలతో పాటు నోట్‌ బుక్స్‌, బ్యాగ్స్‌, షూ, స్టేషనరీ అందిస్తున్నట్లు వివరించారు. నగరంలోని కృష్ణాకాలనీ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో విద్యార్థినులకు ఉచిత రాతపుస్తకాల (అన్‌ రూల్డ్‌ నోట్‌ బుక్స్‌) పంపిణీ కార్యక్రమాన్ని శుక్రవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా 11 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లోని 2,704 విద్యార్థులకు 32,448 నోట్‌ బుక్స్‌ పంపిణీ చేసినట్లు వివరించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్‌ హరికృష్ణ, లైబ్రేరియన్‌ వనమాల, అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు.

ఉపాధ్యాయులకు పీఆర్సీని

వెంటనే ప్రకటించాలి

కాళోజీ సెంటర్‌: ఉపాధ్యాయుల పీఆర్సీని వెంటనే ప్రకటించాలని, పెండింగ్‌ డీఏలపై జీఓ జారీ చేయాలని, సీపీఎస్‌ను రద్దు చేసి ఓపీఎస్‌ అమలు చేయాలని టీపీటీఎఫ్‌ వరంగల్‌ జిల్లా అధ్యక్షుడు ఊటుకూరి అశోక్‌ డిమాండ్‌ చేశారు. యూపీఎస్సీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నాలుగు దశల పోరాట కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని అన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయులందరు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఈ మేరకు రంగశాయిపేట ప్రభుత్వ పాఠశాలలో శుక్రవారం నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వం తమ న్యాయమైన డిమాండ్లు నెరవేర్చేంత వరకు ఉపాధ్యాయులు రోజూ పాఠశాలకు నల్ల బ్యాడ్జీలతోనే హాజరవుతారని స్పష్టం చేశారు. నిరసన కార్యక్రమంలో టీపీటీఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి పి.వీరాచారి, ఉపాధ్యాయులు సీహెచ్‌ ప్రవీణ్‌ కుమార్‌, టి.సునీల్‌ కుమార్‌, ఎం.ఉషారాణి, టి.జ్యోతి, తదితరులు పాల్గొన్నారు.

రాయపర్తి పోలీస్‌స్టేషన్‌ను తనిఖీ చేసిన డీసీపీ

రాయపర్తి: మండల కేంద్రంలోని పోలీస్‌స్టేషన్‌ను వెస్ట్‌జోన్‌ డీసీపీ రాజమహేంద్ర నాయక్‌ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రికార్డులు, పరిసరాలను పరిశీలించారు. ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సిబ్బందిని ఆదేశించారు. కార్యక్రమంలో వర్ధన్నపేట ఏసీపీ అంబటి నర్సయ్య, సీఐ కొమ్మూరి శ్రీనివాసరావు, స్థానిక ఎస్సై ముత్యం రాజేందర్‌, సిబ్బంది పాల్గొన్నారు.

‘విధుల్లో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు’

నర్సంపేట రూరల్‌: విధుల్లో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవని నర్సంపేట ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ దామోదరాబాయి హెచ్చరించారు. నర్సంపేట పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రిలోని పాత భవనంలో కొనసాగుతున్న ఎంసీహెచ్‌, పీపీ యూనిట్‌, డయాలసిస్‌, తెలంగాణ టీహబ్‌ను శుక్రవారం తనిఖీ చేశారు. డయాలసిస్‌ సెంటర్‌కు ఇటీవల వచ్చిన రెండ్‌ బెడ్స్‌ను ఎందుకు వినియోగంలోకి తీసుకురాలేదని సిబ్బందిని దామెదరాబాయి ప్రశ్నించారు. రిజిస్ట్రర్లను పరిశీలించి రోస్టర్‌ వారీగా హాజరు వేయడంలో ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. మందుల కొరత ఉంటే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. సూపరింటెండెంట్‌ వెంట ఆర్‌ఎంఓలు సుధీర్‌ ఉన్నారు.

కాశిబుగ్గ: ‘వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రిలో రోగుల నుంచి ఎవరరు డబ్బులు డిమాండ్‌ చేసినా తొలగింపు తప్పదు. పేషెంట్‌ కేర్‌ మొదలుకుని వార్డు బాయ్‌ వరకు డబ్బులు వసూలు చేసినట్లు తెలిస్తే ఉద్యోగం నుంచి తీసేస్తాం’ అని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు హెచ్చరిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల హైదరాబాద్‌ నీలోఫర్‌ ఆస్పత్రిలో డబ్బులు వసూలు చేసిన పేషెంట్‌ కేర్‌ సిబ్బందిని ఉద్యోగం నుంచి తొలగించారు. ఈనేపథ్యంలో వరంగల్‌లోని ఎంజీఎం, సీకేఎం ప్రసూతి ఆస్పత్రి, హనుమకొండలోని సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌లో కూడా డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో ఆస్పత్రిలో ఆపరేషన్‌ థియేటర్‌, సిటీ స్కాన్‌, వార్డులు, కట్లు కట్టడంతో పాటు గేట్‌ల వద్ద డబ్బులు వసూలు చేస్తారని తరచూ ఆరోపణలు వస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement