పెద్ది సేవలు చిరస్మరణీయం | - | Sakshi
Sakshi News home page

పెద్ది సేవలు చిరస్మరణీయం

Aug 8 2026 1:17 AM | Updated on Aug 8 2026 1:17 AM

నల్లబెల్లి: నర్సంపేట నియోజకవర్గ అభివృద్ధికి మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌ రెడ్డి విశేష కృషి చేశారని, ప్రజా నాయకుడిగా ఆయన సేవలు చిరస్మరణీయమని ఎమ్మెల్సీ ప్రొఫెసర్‌ కోదండరాం, స్టేషన్‌ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కొనియాడారు. మండల కేంద్రంలోని పెద్ది స్వగృహంలో ఆయన సతీమణి స్వప్న, కుటుంబ సభ్యులను వారు శుక్రవారం పరామర్శించారు. ఈ సందర్భంగా సుదర్శన్‌ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పరామర్శించిన వారిలో తెలంగాణ ఉద్యమకారులు, కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ నాయకులు ఉన్నారు. అలాగే, పెద్ది కుటుంబ సభ్యులను మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, జెడ్పీ మాజీ చైర్‌పర్సన్‌ గండ్ర జ్యోతి ఓదార్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement