మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి | - | Sakshi
Sakshi News home page

మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి

Aug 13 2026 1:57 AM | Updated on Aug 13 2026 1:57 AM

వనపర్తిటౌన్‌: విద్యార్థులు భవిష్యత్‌పై శ్రద్ధ చూపకుండా మాదక ద్రవ్యాలకు అలవాటుపడి జీవితాలను నాశనం చేసుకోవద్దని రెండో అదనపు జూనియర్‌ సివిల్‌ న్యాయమూర్తి ఎన్‌.అశ్విని కోరారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి జి.కళార్చన ఆదేశాల మేరకు బుధవారం జిల్లా జువైనల్‌ జస్టిస్‌ బోర్డు కార్యాలయం, మహాత్మా జ్యోతిబా పూలే బాలుర జూనియర్‌ కళాశాలలో ప్రపంచ యువజన దినోత్సవం నిర్వహించగా.. ఆమె ముఖ్యఅతిథిగా హాజరై యువత, విద్యార్థులకు డ్రగ్స్‌, డ్రంకెన్‌ డ్రైవ్‌, బాల్య వివాహాల నిర్మూలన, పోక్సో, ఉచిత నిర్బంద విద్య, మోటారు వాహనాల చట్టం, సైబర్‌ క్రైం గురించి వివరించారు. ఉచిత న్యాయసేవలకై టోల్‌ఫ్రీ నంబర్‌ 15100లో సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో డిప్యూటీ లీగల్‌ ఎయిడ్‌ డిఫెన్స్‌ కౌన్సిల్‌ డి.కృష్ణయ్య, జువైనల్‌ జస్టిస్‌ బోర్డు సిబ్బంది, ప్యానెల్‌, పారా లీగల్‌ వలంటీర్‌, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement