జెండాపండుగకు ముస్తాబు | - | Sakshi
Sakshi News home page

జెండాపండుగకు ముస్తాబు

Aug 15 2026 12:40 AM | Updated on Aug 15 2026 12:40 AM

జెండాపండుగకు ముస్తాబు కార్యక్రమ షెడ్యూల్‌ ఇలా..

న్యూస్‌రీల్‌

వాడవాడలా రెపరెపలాడనున్న మువ్వన్నెల జెండా

అంతరాలే
అసలు సమస్య
వనపర్తి
సర్వే సాగిందిలా..

సీజనల్‌ వ్యాధుల

నియంత్రణకు చర్యలు

కొత్తకోట రూరల్‌: పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించి సీజనల్‌ వ్యాధుల నియంత్రణకు ముందస్తు చర్యలు చేపట్టాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ ఎన్‌.ఖీమ్యానాయక్‌ ఆదేశించారు. శుక్రవారం పురపాలికలోని ప్రభుత్వ ఆస్పత్రి ప్రాంతంలో నిర్వహించిన డ్రై డే కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. వర్షాకాలంలో దోమల నివారణకు పరిసరాలను శుభ్రంగా ఉంచడంతో పాటు నీరు నిల్వ ఉండే ప్రాంతాలను గుర్తించి ఎప్పటికప్పుడు తొలగించాలని సూచించారు. దోమల వృద్ధికి అవకాశం లేకుండా ప్రత్యేక పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని, ప్రజలకు సీజనల్‌ వ్యాధులపై అవగాహన కల్పించాలన్నారు. అనంతరం కొత్తకోట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి అక్కడ రోగులకు అందుతున్న వైద్యసేవలు, సిబ్బంది అందుబాటు, వర్షాకాలంలో వచ్చే సీజనల్‌ వ్యాధులను ఎదుర్కొనేందుకు చేపట్టిన ముందస్తు ఏర్పాట్లను వైద్యాధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు సకాలంలో నాణ్యమైన వైద్యసేవలు అందేలా చూడాలని కోరారు. అదేవిధంగా పాఠశాల విద్యార్థుల యూనిఫాం తయారీ, పంపిణీ పురోగతిని అధికారులతో ఆరా తీశారు. యూనిఫాం పంపిణీ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. అనంతరం మదనాపురం మండలం దంతనూరులో డ్రై డే కార్యక్రమాన్ని పరిశీలించారు. గ్రామంలో నీరు నిల్వ ఉండే ప్రదేశాలను గుర్తించి శుభ్రం చేయాలని, పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. గ్రామపంచాయతీ కార్యాలయాన్ని సందర్శించి కార్యకలాపాలు, పారిశుద్ధ్య నిర్వహణకు సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.

● ఉదయం 9.20 గంటలకు ఎస్పీ సునీతారెడ్డి కలెక్టరేట్‌లోని వేధిక వద్దకు చేరుకుంటారు.

● 9.23 గంటలకు కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి, 9.25 గంటలకు ముఖ్యఅతిథి చీఫ్‌ విప్‌ పట్నం మహేందర్‌రెడ్డి వేదిక వద్దకు చేరుకుంటారు. ఆయనకు పోలీసులు గౌరవ వందనం సమర్పించి స్వాగతం పలకనున్నారు.

● 9.30 గంటలకు జాతీయ పతాక ఆవిష్కరణ, జాతీయగీత ఆలాపన, వందన సమర్పణ, అనంతరం జిల్లా ప్రగతి నివేదికను ముఖ్యఅతిథి చదివి వినిపిస్తారు. స్వాతంత్య్ర సమరయోధులు, తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు సన్మానం, విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు, ఉత్తమ ఉద్యోగులకు ప్రశంసాపత్రాల అందజేత జాతీయ గీతాలాపనతో కార్యక్రమం ముగింపు.

రంగురంగుల విద్యుద్దీపాల వెలుగులో కలెక్టరేట్‌ భవనం

వనపర్తి: 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు కలెక్టరేట్‌ రంగురంగుల విద్యుద్దీపాలు, వేధిక, ఇతర ఏర్పాట్లతో ముస్తాబైంది. శనివారం జరిగే వేడుకలకు శుక్రవారం ఉదయం నుంచే పనులు ప్రారంభించారు. సాయంత్రం కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి ఏర్పాట్లను పరిశీలించి ఎక్కడా లోపం లేకుండా పకడ్బందీగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ చీఫ్‌ విప్‌ పట్నం మహేందర్‌రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని ఉదయం 9.30 గంటలకు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. వేడుకలకు ఎమ్మెల్యే మేఘారెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు, విద్యార్థులు తదితరులు పాల్గొననుండగా.. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా టెంట్లు, కుర్చీలు, స్టాల్స్‌ ఏర్పాటు చేశారు. వేడుకల వేధిక, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ ఏఓకు సూచించారు.

మధ్యాహ్నం తర్వాత

డిజిటల్‌ రేషన్‌ కార్డుల పంపిణీ..

రాష్ట్ర ప్రభుత్వం తొమ్మిది రకాల భద్రత ఏర్పాట్లతో రూపొందించిన డిజిటల్‌ రేషన్‌ కార్డులను స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నారు. సమావేశ మందిరంలో ముఖ్యఅతిథి పట్నం మహేందర్‌రెడ్డి, ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేయనున్నారు. కార్యక్రమం సజావుగా నిర్వహించేందుకు పటిష్ట చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు. సీఎం రేవంత్‌రెడ్డి హైదరాబాద్‌లో మధ్యాహ్నం 2 గంటలకు పంపిణీ కార్యక్రమం ప్రారంభించిన వెంటనే జిల్లాలో సైతం లబ్ధిదారులకు పంపిణీ కార్యక్రమం ప్రారంభించనున్నట్లు కలెక్టర్‌ తెలిపారు.

సైబర్‌ ప్రొఫైలింగ్‌లో వనపర్తికి ప్రథమ స్థానం

వనపర్తి: సైబర్‌ నేరాల నియంత్రణ, ప్రొఫైలింగ్‌లో జిల్లా పోలీస్‌శాఖ అసాధారణ ప్రతిభ కనబర్చి రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. శుక్రవారం హైదరాబాద్‌లోని ఐసీసీసీ భవనంలో తెలంగాణ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో (టీజీసీఎస్‌బీ) ఆధ్వర్యంలో నిర్వహించిన ‘సురక్ష కా తిరంగా’ రాష్ట్రస్థాయి సైబర్‌ అవగాహన సదస్సులో డీజీపీ సీవీ ఆనంద్‌, ప్రముఖ సినీనటుడు అక్కినేని నాగార్జున డీఎస్పీ గిరిబాబుకు ప్రశంసాపత్రం అందజేశారు. ఎస్పీ సునీతారెడ్డి పర్యవేక్షణలో పనిచేస్తున్న జిల్లా సైబర్‌ విభాగం సైబర్‌ నేరస్తుల వివరాల సేకరణ, సమాచార విశ్లేషణ, సమన్వయ సెక్యూరిటీ ప్రొఫైలింగ్‌ను అత్యంత సమర్థవంతంగా నిర్వహించి ఈ అవార్డును కై వసం చేసుకుంది. జిల్లా పోలీసు యంత్రాంగం సమష్టి కృషికి నిదర్శనమని ఎస్పీ కొనియాడారు. సైబర్‌ విభాగం అధికారులు, సిబ్బందిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.

శ్రీరంగాపురం వాసికి ‘మెడల్‌ ఫర్‌ మెరిటోరియస్‌ సర్వీస్‌’

వనపర్తి: హైదరాబాద్‌ సైబర్‌క్రైమ్‌ ఏసీపీ, శ్రీరంగాపురానికి చెందిన రుద్రవరం గుండ్ల శివమారుతికి ప్రతిష్టాత్మకమైన ‘మెడల్‌ ఫర్‌ మెరిటోరియస్‌ సర్వీస్‌’ (ఎంఎంఎస్‌) దక్కింది. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ప్రకటించిన పోలీసు పతకాల్లో శివమారుతి ఈ పురస్కారానికి ఎంపికయ్యారు. వివిధ కేసుల దర్యాప్తులో సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించడం, నేరాల నిరూపణలో కీలక ఆధారాలను సేకరించడం, సీసీ టీవీ ఫుటేజీ విశ్లేషణతో పాటు విధుల్లో సమయస్ఫూర్తిని ప్రదర్శించినందుకు ఈ పతకం లభించింది. హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ పోలీసు కమిషనరేట్ల పరిధిలో ఈ ఏడాది ఈ పతకాన్ని అందుకున్న అధికారుల్లో శివమారుతి ఒక్కరే కావడం విశేషం. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉన్నతాధికారుల ప్రోత్సాహం, తనతో కలిసి పనిచేస్తున్న సిబ్బంది సహకారంతోనే ఈ పతకం దక్కిందన్నారు.

స్వాతంత్య్ర ఫలాలు అందరికీ దక్కాలంటే మరింత

నీతి, నిజాయితీగా

పనిచేయాల్సిన

రంగాలు?

సకాలంలో నాణ్యమైన వైద్యసేవలు

I

I

కలెక్టరేట్‌లో ఏర్పాట్లు పూర్తిచేసిన

జిల్లా అధికార యంత్రాంగం

జాతీయజెండా ఎగురవేయనున్న

ప్రభుత్వ చీఫ్‌ విప్‌ పట్నం మహేందర్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement