జూరాల, రామన్‌పాడు జలాశయాలకు జలకళ
● ఆయకట్టులో జోరందుకున్న సాగు పనులు
● వరి, ఆముదం, కంది, పత్తి సాగుపైనే రైతుల ఆశలు
● నీరులేక సరళాసాగర్ ఆయకట్టు వెలవెల
●
మదనాపురం: వర్షాభావ పరిస్థితులతో అల్లాడిన అన్నదాతల కళ్లలో ఆనందాన్ని నింపుతూ ఇటీవల కురిసిన వర్షాలు నేలతల్లికి జీవం పోశాయి. వరుణుడి కరుణతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ జూరాల జలాశయానికి చేరి ఉమ్మడి పాలమూరు జిల్లా నీటిగండాన్ని పూర్తిగా తొలగించింది. రామన్‌న్‌పాడు జలాశయానికి వరద చేరడంతో ఆయకట్టు రైతులు వ్యవసాయ పనులను ముమ్మరం చేశారు.
ఉమ్మడి మహబూబ్‌నగర్ వరప్రదాయిని ప్రియదర్శిని జూరాల జలాశయానికి ఎగువ నుంచి వరద కొనసాగడంతో జలకళను సంతరించుకుంది. దీంతో నేరుగా రామన్‌పాడు జలశయానికి నిరంతరం నీటిని వదులుతున్నారు. ఆయకట్టు కింద ఉన్న వేలాది ఎకరాలకు సాగునీరు అందించేందుకు మార్గం సుగమమైంది. వర్షాలు ఆలస్యం కావడంతో బోరుబావుల కింద మాత్రమే అరకొరగా వరి సాగు చేసిన రైతులు ఇప్పుడు కాల్వల ద్వారా నీరు విడుదల అవుతుండటంతో సాగుపనులు ముమ్మరం చేశారు. జూరాల ఎడమ కాల్వ ద్వారా ఆత్మకూర్, అమరచింత మండలాలకు, రామన్‌పాడు జలాశయం నుంచి కొత్తకోట, మదనాపురం, పెబ్బేరు, గోపల్‌దిన్నె రిజర్వాయర్ ద్వారా వీపనగండ్ల, పాన్‌గల్, గణప సముద్రం ద్వారా ఖిల్లా ఘనపురం మండలాల్లోని గ్రామాలకు సాగునీరు అందుతుంది. ఇటీవల కురిసిన వర్షాలతో ఆముదం, పత్తి, కంది సాగు చేసిన రైతుల్లో ఆనందం కనిపిస్తోంది.
రామన్‌పాడు
జలాశయంలో
నీటిమట్టం
అన్నదాతలు
బిజీ.. బిజీ...


