కార్మిక సంక్షోభం..! | - | Sakshi
Sakshi News home page

కార్మిక సంక్షోభం..!

Aug 8 2026 1:05 AM | Updated on Aug 8 2026 1:05 AM

విజయనగరం గంటస్తంభం:

వన నిర్మాణ కార్మికులు, గిగ్‌ వర్కర్లు, ఫ్లాట్‌ ఫామ్‌ వర్కర్ల భద్రతను చంద్రబాబు ప్రభుత్వం గాలికొదిలేంది. కొత్త పథకాలను అమలు చేయకపోగా, గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో అమలైన సంక్షేమ పథకాలకు సైతం మంగళం పాడేసింది. సంక్షేమాన్ని విస్మరిస్తూ సంక్షోభంలోకి నెట్టేయడంపై కార్మికలోకం ఆవేదన వ్యక్తంచేస్తోంది.

ఇదీ పరిస్థితి..

ఉమ్మడి విజయనగరం జిల్లాలో దాదాపు 6,09,096 మంది అసంఘటిత రంగ భవన నిర్మాణ కార్మికులు ఉన్నారు. ఇప్పటి వరకు కార్మిక శాఖలో నమోదైన భవన నిర్మాణ కార్మికులు 1,22,502 మంది మాత్రమే. వీరిలో ఎక్కువ మంది నిర్మాణ రంగంపై ఆధారపడిన తాపీ మేసీ్త్రలు, కూలీలు, రాడ్‌ బెండర్లు, ఎలక్ట్రీషియన్లు, ప్లంబర్లు, వడ్రంగులు, పెయింటర్లు, మట్టి పని చేసేవారు, ఇటుక బట్టీ వర్కర్లు ఉన్నారు. ఎన్నికల సమయంలో భవన నిర్మాణ బోర్డును పునరుద్ధరిస్తామని, సాధికార సంస్థ ఏర్పాటు చేస్తామని టీడీపీ మేనిఫెస్టోలో చంద్రబాబు హామీ ఇచ్చారు. అన్ని వర్గాల కార్మికులకు ప్రమాద బీమా, హెల్త్‌ ఇన్సూరెన్స్‌, ప్రత్యేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తామని హామీల వర్షం కురిపించారు. అధికారంలోకి వచ్చి నేటి వరకు ఆ హామీల ఊసే ఎత్తకపోవడంతో కార్మిక లోకం తీవ్ర నిరాశలో మునిగిపోయింది.

అందని సాయం.. ఆవేదనలో కార్మికలోకం

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గతంలో అత్యద్భుతంగా అమలైన వైఎస్సార్‌ బీమా పథకాన్ని చంద్రన్న బీమాగా పేరు మార్చారు. అంతకు మించి పథకం అమలుపై ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. గత ప్రభుత్వంలో వైఎస్సార్‌ బీమా పథకం కింద విజయనగరం జిల్లాలో దాదాపు లక్షలాది కుటుంబాలకు ఆర్థిక సాయం అందింది. ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వంలో ఆ సాయం పూర్తిగా నిలిచిపోయింది.

గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో అందించిన సాయం ఇలా..

ౖవెఎస్సార్‌ కల్యాణమస్తు: భవన, ఇతర నిర్మాణ కార్మికుల పిల్లల పెళ్లిళ్లకు రూ.20,000 చొప్పున లబ్ధి.

ౖవెఎస్సార్‌ బీమా (ప్రమాద మరణం): బాధిత కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం.

సహజ మరణం, వైకల్యం: సహజ మరణానికి రూ.1 లక్ష, ప్రమాదంలో వైకల్యం సంభవిస్తే రూ.5 లక్షలు.

రిజిస్టర్‌ కాని కార్మికులకు సైతం: రిజిస్టర్‌ కాని కార్మికులు ప్రమాదాల్లో మరణిస్తే రూ.5 లక్షలు, వైకల్యానికి రూ.2.5 లక్షల సాయం.

ఆరోగ్యశ్రీ వైద్య సేవలు: అసంఘటిత రంగ కార్మిక కుటుంబాలు అనారోగ్యం బారిన పడితే ఆరోగ్యశ్రీ కింద ఏకంగా రూ.25 లక్షల వరకు పూర్తి ఉచిత వైద్యం.

ప్రస్తుతం వివాహ కానుక కింద రూ.20 వేలు, ప్రసూతి సహాయం కింద రూ.20వేలు, సహజ మరణం సహాయం రూ.50వేలు, దహన సంస్కారాల ఖర్చులు రూ.20వేలు మాత్రమే కార్మికులకు అందుతున్నాయి.

ప్రమాద బీమాను గాలికొదిలేసిన

చంద్రబాబు సర్కారు

గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ పథకాలకు సైతం గండి

మొత్తం 6,09,096 మంది

కార్మికులకు దక్కని భద్రత

సార్వత్రిక ఎన్నికల హామీలకు మంగళం!

వైఎస్సార్‌ బీమాను చంద్రన్న బీమాగా పేరు మార్చడమే తప్ప సాయం సున్నా

అవగాహన లేక వేలాది మంది

రెన్యువల్‌కు దూరం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement