డీఎస్సీ అక్రమాలకు నిరసనగా నెల్లిమర్లల్లో చేపట్టిన శాంతియుత ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. ముందుగానే నాయకులకు నోటీసులు ఇచ్చారు. కొందరిని గృహనిర్బంధం చేశారు. నెల్లిమర్ల పట్టణ పరిధిలోని జరజాపుపేట శ్రీరాజబంగారమ్మ గుడి ప్రాంగణంలో నెల్లిమర్ల మాజీ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు, ఎమ్మెల్సీ సురేష్‌బాబు ఆధ్వర్యంలో నిరసన ర్యాలీకి సన్నాహాలు చేశారు. అక్కడకు పోలీసులు చేరుకుని ర్యాలీని అడ్డుకున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరుద్యోగులు, వైఎస్సార్‌సీపీ శ్రేణులు నినదించారు. కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకుడు నెక్కల నాయుడుబాబు, పార్టీ మండలాధ్యక్షులు గేదెల సన్యాసినాయుడు, పతివాడ అప్పలనాయుడు, తమ్మునాయుడు, ఉప్పాడ సూర్యనారాయణరెడ్డి, పట్టణ అధ్యక్షుడు చిక్కాల సాంబశివరావు, తదితరులు పాల్గొన్నారు.


