విజయనగరం ఫోర్ట్: హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌పై అవగాహన కల్పించాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి వైద్యసిబ్బందికి సూచించారు. హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌పై అవగాహన కల్పించడం కోసం రూపొందించిన ఇంటిన్సైఫెడ్ ఐఈసీ క్యాంపైన్ కార్యక్రమాన్ని సోమవారం సాయంత్రం తన చాంబర్‌లో ప్రారంభించారు. వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. ప్రచార కార్యక్రమం జిల్లాలో రెండు నెలలు పాటు కొనసాగుతుందన్నారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌ఓ ఎస్.జీవనరాణి, ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ దేవీమాధవి, సర్వజన ఆస్పత్రి సూపరింటెండెంట్ అల్లు పద్మజ, డీఎల్‌ఓ రాణి పాల్గొన్నారు.
కార్పొరేషన్ తీరుపై నమ్మకం లేదా?
● కమిషనరేట్ కార్యాలయంలో
పీజీఆర్‌ఎస్‌కు ఒక అర్జీ
● కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్‌కు
మున్సిపల్ సమస్యలపై 15 అర్జీలు
విజయనగరం అర్బన్: నగర పాలక సంస్థ అధికారులు, పాలకవర్గంపై నగర ప్రజలకు నమ్మకం లేదా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. సమస్యలను కార్పొరేషన్ అఽధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకలపోవడంతో నగరవాసులు కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించే పీజీఆర్‌ఎస్ వైపు అడుగులు వేస్తున్నారు. మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన ‘ప్రజా వినతుల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్)’ కార్యక్రమానికి ప్రజల నుంచి స్పందన కరువైంది. ఏకంగా నగరవ్యాప్తంగా కేవలం ఒక్కటంటే ఒక్క వినతి పత్రం మాత్రమే రావడం గమనార్హం. అయితే, మున్సిపల్ పరిధిలోని సమస్యలపై కలెక్టర్ వేదికలో ఏకంగా 15 వినతి పత్రాలు సమర్పించారు. స్థానిక కార్పొరేషన్ అధికారులపై నమ్మకం సన్నగిల్లడం వల్లే నగరవాసులు కలెక్టరేట్ బాటపడుతున్నట్టు స్పష్టమవుతోంది. మున్సిపల్ కార్యాలయంలో ప్రజారోగ్య విభాగానికి సంబంధించి వచ్చిన ఆ ఒక్క వినతిని కమిషనర్ బాలస్వామి స్వీకరించి, అధికారులకు బదిలీ చేశారు.
పంటల బీమా నమోదులో జాప్యం వద్దు
విజయనగరం ఫోర్ట్: పంటల బీమా నమోదు లో జాప్యంచేయొద్దని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి అన్నారు. కలెక్టరేట్ నుంచి వ్యవసాయశాఖ ఏడీలు, ఎంపీడీఓలు, మండల వ్యవసాయ అధికారులతో సోమవారం సాయంత్రం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. జిల్లాలో ఇప్పటివరకు 15,600 హెక్టార్లకు మాత్రమే పంటల బీమా జరిగిందని, బీమా కేవలం నాలుగు రోజుల సమయం ఉన్నందున రైతులు సద్వినియోగం చేసుకునేలా చూడాలన్నారు. జిల్లాలో ఎలినినో పరిస్థితుల దృష్ట్యా రైతులతో తక్షణమే పంటల బీమా నమోదు చేయించాలన్నారు.


