● నిరుద్యోగులకు అన్యాయం చేయొద్దు | - | Sakshi
Sakshi News home page

● నిరుద్యోగులకు అన్యాయం చేయొద్దు

Aug 11 2026 1:54 AM | Updated on Aug 11 2026 1:54 AM

చంద్రబాబు ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేస్తోందని, డీఎస్సీలో అక్రమాలకు పాల్పడి అర్హులకు అన్యాయం చేసిందని గజపతినగరం మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య విమర్శించారు. చంద్రబాబు పాలనపై యువత తిరుగుబాటు ఆరంభమైందన్నారు. ఉద్యోగ నియామకాల్లో అక్రమాలు, నిరుద్యోగ భృతి ఇవ్వకుండా మోసం చేయడం, ఫీజురీ యింబర్స్‌మెంట్‌ చెల్లించకపోవడంపై యువత పోరుకు సిద్ధమైందన్నారు. గజపతినగరం జూనియర్‌ కాలేజీ వద్ద ప్రారంభమైన నిరసన ర్యాలీని పోలీసులు అడ్డుకోవడంపై ఆయన అసహనం వ్యక్తంచేశారు. డీఎస్సీలో నిరుద్యోగ అభ్యర్థులకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నిస్తే ప్రభుత్వం పోలీసులతో నోళ్లు నొక్కించే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. కార్యక్రమంలో నియోజకవర్గం పరిశీలకుడు సిరిపురపు జగనన్‌మోహనరావు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement