● 13న విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం
● కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి
విజయనగరం గంటస్తంభం: ఎస్సీ, ఎస్టీలపై జరిగే దాడులు, వివక్షకు సంబంధించి నమోదైన కేసుల్లో బాధితులకు చట్టపరమైన రక్షణతో పాటు సకాలంలో పరిహారం, పునరాహసం అందేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి ఆదేశించారు. ఎస్సీ,ఎస్టీ(అత్యాచారాల నిరోధక) చట్టం–1989, పౌర హక్కుల పరిరక్షణ చట్టం–1955 అమలుపై 2026–27 ఆర్ధిక సంవత్సరం రెండో త్రైమాసికానికి సంబంధించిన జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం ఈనెల 13వ తేదీ ఉదయం 11 గంటలకు కలెక్టరేట్‌లోని ఆడిటోరియంలో నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో ఈ చట్టాల కింద నమోదైన కేసుల ప్రస్తుత పరిస్థితి, దర్యాప్తు, ప్రాసిక్యూషన్ పురోగతి, బాధితులకు అందించిన ఆర్థిక సహాయం, ఉపశమనం, పునరాహస చర్యలను సమీక్షించనున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు.


