విజయనగరం ఫోర్ట్: తల్లీబిడ్డల ఆరోగ్య పరిక్షణకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి తెలిపారు. 102 తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ 11 నూతన వాహనాలను కలెక్టరేట్ వద్ద జెండా ఊపి ఆయన మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవించిన బాలింతలు, నవజాత శిశువులను సురక్షితంగా 102 వాహనాల ద్వారా ఉచితంగా ఇళ్లకు చేర్చనున్నట్లు తెలిపారు. ప్రయాణ సమయంలో తల్లితో పాటు ఇద్దరు సహాయకులు, కుటుంబ సభ్యులు కూడా వాహనంలో ప్రయాణించే అవకాశం ఉంటుందన్నారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఎస్.జీవనరాణి, డీసీహెచ్‌ఎస్ డాక్టర్ పద్మశ్రీ రాణి, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ అల్లు పద్మజ, ఆరోగ్యశ్రీ జిల్లా కో ఆర్డినేటర్ డాక్టర్ సాయిరాం. డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్ సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ రాంసుందర్ రెడ్డి


