మద్యంతర ఉత్తర్వులు..! | - | Sakshi
Sakshi News home page

మద్యంతర ఉత్తర్వులు..!

Aug 7 2026 12:50 AM | Updated on Aug 7 2026 12:50 AM

మద్యంతర ఉత్తర్వులు..!

వీరఘట్టం: ఎవరేమనుకుంటే మనకేమి? మన పని జరిగిపోతే చాలని భావిస్తోంది టీడీపీ మద్యం సిండికేట్‌. గతంలో జారీ చేసిన నోటిఫికేషన్‌ను ఉల్లంఘిస్తూ నిబంధనలకు విరుద్ధంగా ఎకై ్సజ్‌శాఖ అడ్డుగోలుగా నిర్ణయం తీసుకోవడం వెనుక మద్యం సిండికేట్‌ హస్తం ఉన్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. పార్వతీపురం మున్సిపాలిటీలో ఏర్పాటు చేసిన ఒక బార్‌ను వీరఘట్టం పంచాయతీ పరిధిలోకి మార్చేందుకు అనుమతి ఇస్తూ ఎకై ్సజ్‌శాఖ ఉత్తర్వులు ఇచ్చింది. ఎకై ్సజ్‌శాఖ వర్గాలే విస్తుపోయేలా ఉన్న ఈ వ్యవహారానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

నోటిఫికేషన్‌ లైసెన్స్‌ పార్వతీపురంలో..

గతంలో బార్‌ల ఏర్పాటుకు విధివిధానాలను ఖరారు చేస్తూ ఎకై ్సజ్‌ పాలసీని ప్రభుత్వం జారీ చేసింది. ఆ ప్రకారం మున్సిపల్‌ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల పరిధిలో మాత్రమే బార్‌లు ఏర్పాటు చేయాలని నిబంధనలు విధించింది. ఆ నిబంధనల మేరకు గతంలో పార్వతీపురం మున్సిపాలిటీ పరిధిలో బార్‌ల ఏర్పాటుకు ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఆ నోటిఫికేషన్‌ ప్రకారం టెండర్లు దాఖలు చేసిన వారికి లాటరీ విధానంలో బార్‌ల లైసెన్సులు కేటాయించారు. ఆ విధంగా పార్వతీపురం మున్సిపాలిటీ పరిధిలో బార్‌లు ఏర్పాటయ్యాయి. అయితే ఇదిలా ఉండగా..ఈ వ్యవహారం మరో మలుపు తిరిగింది.

నిబంధనలను తోసిరాజని వీరఘట్టానికి బదిలీ

పార్వతీపురంలో ఏర్పాటు చేసిన ఒక బార్‌ను వీరఘట్టం పంచాయతీకి మార్చాలని టీడీపీ సిండికేట్‌ భావించింది. కానీ వీరఘట్టం పంచాయతీ పరిధిలో బార్‌ ఏర్పాటు చేసేందుకు నిబంధనలు అంగీకరించవు. ఇదే విషయాన్ని ఎకై ్సజ్‌శాఖ స్పష్టం చేసింది. అయినా సరే టీడీపీ సిండికేట్‌ రాజధాని స్థాయిలో పావులు కదిపింది. పార్వతీపురంలో ఉన్న బార్‌ను నిబంధనలకు విరుద్ధంగా నైనా సరే వీరఘట్టం పంచాయతీ పరిధిలోకి మార్చేందుకు ఏకంగా ఎకై ్సజ్‌శాఖ స్వయంగా ఉత్తర్వులు జారీ చేసేలా కథ నడిపించింది. టీడీపీ మద్యం సిండికేట్‌తో కుమ్మకై ్కన ఎకై ్సజ్‌శాఖ ఉన్నతాధికారులు ఈ అడ్డగోలు జీఓ జారీ చేశారని ఎకై ్సజ్‌శాఖ వర్గాలే విమర్శిస్తున్నాయి. పంచాయతీల్లో అసాంఘిక పరిస్థితులు ఏర్పడకుండా ఉండేందుకు, శాంతి భద్రతల పరిరక్షణకు బార్‌లు ఏర్పాటు చేయకూడదన్నది గతంలో తీసుకున్న నిబంధన. అయినా సరే ఆ నిబంధనలను ఉల్లంఘిస్తూ టీటీపీ మద్యం సిండికేట్‌ దోపిడీకి ప్రభుత్వం తలుపులు తెరచింది.దీనిపై వీరఘట్టం ప్రజలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.బార్‌ ఏర్పాటును అడ్డుకుంటామని హెచ్చరిస్తున్నారు.

పంచాయతీ పరిధిలోకి మున్సిపాలిటీ పరిధిలో ఉన్న బార్‌ తరలింపు

ఉత్తర్వులు జారీ చేసిన ఎకై ్సజ్‌ శాఖ అధికారులు

బార్‌ ఏర్పాటును అడ్డుకుంటామంటున్న వీరఘట్టం ప్రజలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement