పార్వతీపురంలో ఉన్న సీఆర్‌బీ వైన్స్ రెస్టారెంట్ అండ్ బార్‌ను వీరఘట్టంలో పెట్టుకునేందుకు బార్ యజమాని దరఖాస్తు చేసుకున్నారు. ఆ దరఖాస్తు మేరకు బార్‌ను వీరఘట్టం తరలించేందుకు అనుమతులు వచ్చాయి.ఇది ప్రభుత్వ నిర్ణయం. బార్ ఏర్పాటుకు ప్రజల నుంచి అభ్యంతరాలు వస్తే ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తాం. కె.సహదేవ, ఎకై ్సజ్ సూపరింటెండెంట్,
పార్వతీపురం మన్యం జిల్లా
బార్ ఏర్పాటు చేస్తే గొడవలు పెరుగుతాయి
వీరఘట్టంలో ప్రస్తుతం ఉన్న మూడు మద్యం దుకాణాల వల్ల చీకటి పడితే రోడ్లపై నిత్యం ఏదో ఒక తగాదా జరుగుతూనే ఉంది. ఆ సమయంలో మహిళలు రోడ్డుపై తిరగలేని పరిస్థితి ఏర్పడింది. ఇక బార్ ఏర్పాటు చేస్తే మరిన్ని తగాదాలు ఏర్పడతాయి. బార్ ఏర్పాటును అడ్డుకుంటాం. వీరఘట్టం పట్టణ అభివృద్ధికి ఏదో ఒక మంచి పనిచేయండి తప్ప బార్లు ఏర్పాటు చేసి తగాదాలను పెంచవద్దు.
జె.అమర్‌నాథ్, వీరఘట్టం


