టీచర్లకు టెట్‌ కష్టాలు! | - | Sakshi
Sakshi News home page

టీచర్లకు టెట్‌ కష్టాలు!

Aug 5 2026 2:23 AM | Updated on Aug 5 2026 2:23 AM

రామభద్రపురం:

విద్యార్హత, వృత్తి సామర్థ్యాలను పరీక్షించి నాణ్యమైన అభ్యర్థులను ఎంపిక చేయాలనే ఉద్దేశంతో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌)ఉత్తీర్ణత నిరుద్యోగ బీఈడీ, డీఈడీ అభ్యర్థులతో పాటు టీచర్లకు ప్రభుత్వం తప్పనిసరి చేసింది. టీచర్లు ప్రస్తుత సర్వీసు కొనసాగించాలన్నా.. ఉద్యోగోన్నతి పొందాలన్నా టెట్‌ పరీక్ష తప్పకుండా రాసి ఉత్తీర్ణత సాధించాల్సి ఉంది. దీంతో ఏమి చేయాలో అర్థంకాక అయ్యవార్లు తలలు పట్టుకుంటున్నారు. ఐదేళ్లకు పైబడి సర్వీసు ఉన్న ఉపాధ్యాయులు రెండేళ్ల లోపు టెట్‌ రాసి ఉత్తీర్ణులవ్వాలని సూచించడంతో 20, 25 ఏళ్ల కిందట ఉపాధ్యాయులుగా ఎంపికై న వారంతా ఈ వయస్సులో టెట్‌ రాసి ఉత్తీర్ణత ఎలా సాధిస్తామంటూ ఆవేదన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం కూడా కనీసం పట్టించుకోకుండా, కోర్టులో అప్పీలు చేయకుండా, టీచర్లకు టెట్‌ కష్టాలు తెచ్చిపెట్టిందని ఉపాధ్యాయులు, సంఘాల నాయకులు మండిపడుతున్నారు.

సవాల్‌గా మారిన టెట్‌

జిల్లాలో 12,358 మంది అభ్యర్థులు..

జిల్లాలో టెట్‌ అర్హత లేని ఉపాధ్యాయులతో పాటు నిరుద్యోగ బీఈడీ, డీఈడీ అభ్యర్థులు సుమారు 12,358 మంది టెట్‌ పరీక్షలు రాయనున్నారు. ఈ నెల 5 నుంచి 16వ తేదీ వరకు 3 పరీక్ష కేంద్రాలలో పరీక్షలు నిర్వహించనున్నారు. రోజూ రెండు సెషన్స్‌లో జరగనున్న టెట్‌ పరీక్షలను మొదటి సెషన్‌ ఉదయం 9.30 గంటల నుంచి 12 గంటల వరకు, రెండో సెషన్‌ మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్‌ ద్వారా పరీక్షలు నిర్వహించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement