రాష్ట్ర స్థాయి పోటీల్లోనూ సత్తా చాటండి | - | Sakshi
Sakshi News home page

రాష్ట్ర స్థాయి పోటీల్లోనూ సత్తా చాటండి

Aug 5 2026 2:23 AM | Updated on Aug 5 2026 2:23 AM

విజయనగరం అర్బన్‌: రాష్ట్ర స్థాయి జూనియర్‌ అథ్లెటిక్స్‌ పోటీలకు ‘ది నేషనల్‌ స్కూల్‌’కు చెందిన పలువురు విద్యార్థులు ఎంపికై నట్లు ఆ పాఠశాల కరెస్పాడెంట్‌ బి.రామారావు ఓ ప్రకటనలో మంగళవారం తెలిపారు. ఇటీవల నిర్వహించిన జిల్లా స్థాయి జావెలిన్‌ త్రో పోటీల్లో పదో తరగతి విద్యార్థి ఎస్‌.అఖిల్‌ ప్రథమ స్థానంలో, అదే తరగతికి చెందిన కె.గౌతమ్‌ 600 మీటర్ల పరుగు పందెంలో ద్వితీయ స్థానంలో నిలిచి సత్తా చాటారు. దీంతో వారిద్దరూ ఆగస్టు 11 నుంచి 13వ తేదీ వరకు తిరుపతిలోని ఎస్వీ యూనివర్సిటీ మైదానంలో జరగనున్న రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్‌ పోటీల్లో పాల్గొనే జిల్లా జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్నారన్నారు. చదువుతో పాటు క్రీడల్లోనూ విశేష ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ‘ది నేషనల్‌ స్కూల్‌’ కరెస్పాండెంట్‌ అండ్‌ ప్రిన్సిపాల్‌ బి.రామారావు, డైరెక్టర్‌ డాక్టర్‌ ఎంవీఎన్‌ వెంకటరావు, వ్యాయామ ఉపాధ్యాయుడు కె.శ్రీనివాసరావు, ఎల్‌.మహేష్‌ అభినందించారు. రాష్ట్ర స్థాయి పోటీల్లోనూ సత్తా చాటి, తమకు, జిల్లాకు, రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.

రాష్ట్ర స్థాయి జూనియర్‌ అథ్లెటిక్స్‌ పోటీలకు ‘ది నేషనల్‌ స్కూల్‌’

విద్యార్థులు

ఆగస్టు 11 నుంచి తిరుపతిలో జరిగే పోటీల్లో జిల్లా జట్టుకు ప్రాతినిధ్యం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement