గిరిజనుల అభ్యున్నతికి సమష్టి కృషి అవసరం | - | Sakshi
Sakshi News home page

గిరిజనుల అభ్యున్నతికి సమష్టి కృషి అవసరం

Aug 7 2026 12:38 AM | Updated on Aug 7 2026 12:38 AM

● షెడ్యూల్డ్‌ తెగల సంక్షేమ కమిటీ చైర్‌పర్సన్‌ మిరియాల శిరీషాదేవి ● కేజీహెచ్‌లో గిరిజనులకు ప్రత్యేక సేవలు: కలెక్టర్‌ అభిషిక్త్‌ కిశోర్‌

మహారాణిపేట: గిరిజనుల అభ్యున్నతికి అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేయాలని ఏపీ శాసనసభ షెడ్యూల్డ్‌ తెగల సంక్షేమ కమిటీ చైర్‌పర్సన్‌ మిరియాల శిరీషా దేవి అధికారులను ఆదేశించారు. జిల్లా పర్యటనలో భాగంగా కలెక్టరేట్‌లో గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గిరిజన గురుకులాలతో పోలిస్తే నగర గురుకులంలో మెరుగైన వసతులు ఉన్నాయన్నారు. జీసీసీ ద్వారా గిరిజన విద్యార్థులకు అవసరమైన వస్తువులు అందుబాటులోకి తేవాలన్నారు. కమిటీ సభ్యుడు నిమ్మక జయకృష్ణ మాట్లాడుతూ గిరిజన విద్యార్థులకు పోటీ పరీక్షలపై శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ెసమావేశంలో కమిటీ సభ్యులు పేరాబత్తుల రాజశేఖరం, రేగం మత్స్యలింగం, జేసీ విద్యాధరి, వీఎంఆర్డీఏ కమిషనర్‌ తేజ్‌ భరత్‌, జీసీసీ ఎండీ శోభిక, అసెంబ్లీ జాయింట్‌ సెక్రటరీ పి.వి.సుబ్బారెడ్డి, అసిస్టెంట్‌ సెక్రటరీ యు.నాగమునియ్య, డీఆర్వో ఎం.విశ్వేశ్వరనాయుడు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement