విశాఖ తూర్పు నియోజకవర్గంలో 13వ వార్డు ఆరిలోవ లాస్ట్ బస్టాప్ వద్ద వైఎస్సార్ విగ్రహం నుంచి ర్యాలీకి ఏర్పాట్లు చేశారు. సుమారు 400 మంది పార్టీ నేతలు, కార్యకర్తలు, విద్యార్థులు అక్కడికి చేరుకున్నారు. ర్యాలీ పాయింట్ వద్ద పోలీసులు నోటీసులు అందించారు. అయినా ర్యాలీకి ప్రయత్నించడంతో సుమారు 100 మంది పోలీసులు అడ్డుకున్నారు. ఎమ్మెల్సీ వరుదు కల్యాణి, మొల్లి అప్పారావు, నియోజకవర్గ పరిశీలకులు పేడాడ రమణకుమారితోపాటు మరో ఎనిమిది మందిని అరెస్టు చేశారు. మిగిలిన వారిని చెదరగొట్టారు. అయినప్పటికీ డీఎస్సీ అక్రమాలపై నిరసనకారులు నినాదాలు కొనసాగించారు.
తూర్పు సమన్వయకర్త మొల్లి అప్పారావును పోలీసు స్టేషన్‌కు తరలిస్తున్న పోలీసులు


