వైజాగ్‌ మారథాన్‌కు ఏఐఎంఎస్‌ గుర్తింపు | - | Sakshi
Sakshi News home page

వైజాగ్‌ మారథాన్‌కు ఏఐఎంఎస్‌ గుర్తింపు

Aug 11 2026 1:54 AM | Updated on Aug 11 2026 1:54 AM

మహారాణిపేట: వైజాగ్‌ మారథాన్‌కు అసోసియేషన్‌ ఆఫ్‌ ఇంటర్నేషనల్‌ మారథాన్స్‌ అండ్‌ డిస్టెన్స్‌ రేసెస్‌ (ఏఐఎంఎస్‌) ధ్రువీకరణ లభించింది. వైజాగ్‌ రన్నర్స్‌ సొసైటీ ఆధ్వర్యంలో నవంబర్‌ 29న నిర్వహించనున్న ‘సంధ్యా మైరెన్స్‌ వైజాగ్‌ మారథాన్‌’ ఐదో ఎడిషన్‌ వివరాలను నిర్వాహకులు సోమవారం బీచ్‌రోడ్డులోని ఓ హోటల్‌లో వెల్లడించారు. నాలుగు కేటగిరీల్లో మారథాన్‌ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆసక్తి ఉన్న రన్నర్లు వెబ్‌సైట్‌ ద్వారా తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు. విజేతలకు మొత్తం రూ.12 లక్షల విలువైన బహుమతులు అందించనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో సంధ్యా మైరెన్స్‌ లిమిటెడ్‌ డైరెక్టర్‌ అరుణ్‌ కొరగ్రుంట, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, అరిలోవ అపోలో హాస్పిటల్స్‌ సీవోవో డాక్టర్‌ కృష్ణ ప్రసాద్‌, వరుణ్‌ గ్రూప్‌ చైర్మన్‌ ప్రభు కిషోర్‌, ఫైజర్‌ హెల్త్‌కేర్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ సైట్‌ హెడ్‌ రవిచందర్‌ కట్టా, శ్రీకన్య ఐరన్‌–స్టీల్స్‌ చైర్మన్‌ శ్రీనివాస్‌ దుద్దుపూడి, జ్యువెలరీ హౌస్‌ చైర్మన్‌ శ్యామ్‌, టాటా కన్స్యూమర్‌ ప్రొడక్ట్స్‌ ప్రతినిధులు, వైజాగ్‌ రన్నర్స్‌ సొసైటీ అధ్యక్షుడు శ్రీనివాస్‌ కంచెటి, కోర్‌ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement