బాజీ జంక్షన్‌లోని విజేత సూపర్‌మార్కెట్ సమీపంలో ఉదయం 10.30 గంటలకు ర్యాలీ ప్రారంభించేందుకు పార్టీ శ్రేణులు సిద్ధమయ్యాయి. నియోజకవర్గ పరిశీలకుడు జహీర్ అహ్మద్ ఆధ్వర్యంలో ర్యాలీ ప్రారంభమైన వెంటనే పోలీసులు అడ్డుకున్నారు. ముందస్తు నోటీసులు ఇవ్వలేదంటూ పార్టీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తుండగానే పోలీసులు చుట్టుముట్టారు. జహీర్ అహ్మద్, మాజీ డిప్యూటీ మేయర్ జియ్యాని శ్రీధర్, పార్లమెంట్ పరిశీలకుడు కదిరి బాబూరావు సహా 10 మందిని అరెస్టు చేసి ఎయిర్‌పోర్టు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.


