జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్
అల్లిపురం: నగరంలో తాగునీటి సమస్య ఉన్న ప్రాంతాలను ముందుగానే గుర్తించి, ప్రజలకు ఇబ్బందులు లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లతో నీటిని సరఫరా చేయాలని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ అధికారులను ఆదేశించారు. రష్యా పర్యటన నుంచి తిరిగొచ్చిన వెంటనే ఆదివారం రాత్రి టౌన్ సర్వీస్ రిజర్వాయర్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. నీటి సరఫరా పరిస్థితి, డయల్ ఏ ట్యాంకర్, ఆన్‌లైన్ బుకింగ్ వివరాలను పరిశీలించారు. కేఆర్‌ఎం కాలనీ, ముడసర్లోవ పరిసరాలు, ఆరిలోవలోని 10, 11, 12, 13 వార్డులు, పెదవాల్తేరు డాక్టర్స్ కాలనీ ప్రాంతాల్లో మూడు రోజులపాటు జీవీఎంసీ ట్యాంకర్ల ద్వారా ఉచితంగా నీటిని సరఫరా చేయాలని చెప్పారు. సోమవారం ఉదయం కేఆర్‌ఎం కాలనీలో పర్యటించి స్థానికులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు.


