ఉక్కునగరం: పెట్రోల్ బంకుల్లో స్కానర్లు మార్చి నగదు మోసాలకు పాల్పడుతున్న ఇద్దరిని స్టీల్‌ప్లాంట్ పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీకాకుళం జిల్లా రణస్థలం గ్రామానికి చెందిన ఎండ భవానీ అలియాస్ బాలాజీ స్టీల్‌ప్లాంట్ టౌన్‌షిప్ సెక్టార్–11లోని ఓ పెట్రోల్ బంకులో ఉద్యోగిగా చేరాడు. అనంతరం విజయనగరం జిల్లా నెలిమర్ల మండలం కొత్తూరు గ్రామానికి చెందిన మత్స రమేష్‌తో కలిసి బంకులో ఉన్న స్కానర్‌కు బదులుగా తమ సొంత స్కానర్‌ను ఉపయోగించి నగదు తమ ఖాతాల్లోకి మళ్లిస్తూ మోసాలకు పాల్పడ్డారు. ఈ వ్యవహారాన్ని గుర్తించిన పెట్రోల్ బంక్ యాజమాన్యం స్టీల్‌ప్లాంట్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎస్‌ఐ నజీర్ దర్యాప్తు చేపట్టి ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం రిమాండ్ విధించినట్లు పోలీసులు తెలిపారు.
ఇద్దరి అరెస్ట్


