సింథియా: బెంగళూరులో జరిగే ఇండియన్ ప్రొఫెషనల్ బాక్సింగ్ లీగ్ (ఐపీబీఎల్) పోటీల్లో పాల్గొనేందుకు జై భీమ్ బాక్సింగ్ క్లబ్‌కు చెందిన ఎనిమిది మంది బాక్సర్లు, ఇద్దరు కోచ్‌లు, ఒక మేనేజర్ ఆదివారం బయలుదేరారు. క్లబ్‌లో నిర్వహించిన వీడ్కోలు కార్యక్రమంలో ఎంఈఎస్ జేఈ రమేష్, అంబేద్కర్ ఫెలోషిప్ అవార్డు గ్రహీత యువీ రావు క్రీడాకారులకు టీషర్టులు, క్యాప్‌లు, హెల్త్ డ్రింక్స్ అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా క్లబ్ వ్యవస్థాపకుడు గుర్రాల రామారావు మాట్లాడుతూ.. ఐపీబీఎల్‌లో పాల్గొనడం ద్వారా ప్రొఫెషనల్ బాక్సింగ్‌లో జాతీయ, అంతర్జాతీయ అవకాశాలు లభిస్తాయని చెప్పారు. అనంతరం స్నేహితుల దినోత్సవాన్ని పురస్కరించుకుని కేక్ కట్ చేశారు.


