● శిశువు పుట్టిన గంటలోపే పట్టాలి
● డీఎంహెచ్‌ఓ డాక్టర్ సుధాకర్ లాల్
అనంతగిరి: శిశువు పుట్టిన గంటలోపే ముర్రుపాలు తాపించాలని, ఈ పాలు పిల్లల పాలిట అమృతంతో సమానమని డీఎంహెచ్‌ఓ డాక్టర్ కే సుధాకర్ లాల్ అన్నారు. ప్రపంచ తల్లిపాల వారోత్సవాలను (ఆగస్టు ఒకటి నుంచి 7వ తేదీ వరకు) పురస్కరించుకొని శనివారం వికారాబాద్ పట్టణం రామయ్యగూడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వాల్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. అనంతరం గర్భిణులు, బాలింతలకు తల్లిపాల ప్రాముఖ్యతను తెలియజేశారు. పుట్టిన పిల్లలకు ఆరు నెలల వరకు తల్లిపాలు మాత్రమే పట్టాలన్నారు. తల్లిపాలలో రోగ నిరోధక శక్తి ఉంటుందన్నారు. పిల్లల మెదడుకు, శారీరక ఎదుగుదలకు ఎంతగానో తోడ్పడుతుందన్నారు. తల్లి బిడ్డల మధ్యలో అనుబంధం పెరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో ప్రోగ్రాం ఆఫీసర్లు డాక్టర్ వరలక్ష్మి, డాక్టర్ అమృత లక్ష్మి, వైద్యాధికారి డాక్టర్ సౌమ్య, డిప్యూటీ డెమో శ్రీనివాసులు, మురళి, మహేశ్‌కుమార్, వైద్యారోగ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


