మొయినాబాద్: పాఠశాల విద్యార్థులను తరలించే ప్రైవేటు బస్సులు ప్రభుత్వ నిబంధనలను ఏమాత్రం పాటించడం లేదు. వీరి చర్యలతో పిల్లలకు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని దుస్థితి నెలకొంది. ర్యాష్ డ్రైవింగ్, రాంగ్ రూట్లో వెళ్తూ విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. మొయినాబాద్‌లోని హైదరాబాద్– బీజాపూర్ జాతీయ రహదారిపై ఎన్నో యూటర్న్‌లు ఉన్నా.. శ్రీచైతన్య స్కూల్ బస్సులు నిత్యం ఉదయం, సాయంత్రం వేళల్లో రాంగ్ రూట్లోనే ప్రయాణం సాగిస్తున్నాయి. వీరి చర్యలను చూసి మిగిలిన వాహనదారులు, స్థానికులు మండిపడుతున్నారు. పిల్లలకు ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ట్రాఫిక్ పోలీసులు, ఆర్‌టీఏ అధికారులు స్పందించి నిబంధనలు పాటించని ప్రైవేటు స్కూళ్ల బస్సులపై కఠిన చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
నిత్యం రాంగ్ రూట్లో వెళ్తున్న స్కూల్ బస్సులు


