ఆలయాల అభివృద్ధికి కృషి | - | Sakshi
Sakshi News home page

ఆలయాల అభివృద్ధికి కృషి

Aug 2 2026 7:20 AM | Updated on Aug 2 2026 7:20 AM

కాంగ్రెస్‌ నేత బుయ్యని శ్రీనివాస్‌రెడ్డి

దోమ: ఆలయాల అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని ఆర్‌బీఓఎల్‌ సీఈఓ, కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత బుయ్యని శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. శనివారం మండలంలోని దొంగ ఎన్కేపల్లిలో శివాయల నిర్మాణానికి రూ.50 వేలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆలయాలను కాపాడుకోవడం మన బాధ్యత అన్నారు. కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్‌ వెంకట్‌రెడ్డి, ఉప సర్పంచ్‌ సంజీవ్‌కుమార్‌, గ్రామస్తులు సంతోష్‌రెడ్డి, వెంకన్న, సాయి, బాబు, గోపాల్‌, శేఖర్‌రెడ్డి, శ్రీపివాస్‌రెడ్డి, ఆలయ అర్చకుడు శివకుమార్‌, తదితరులు పాల్గొన్నారు.

నియామకం

మర్పల్లి: తెలంగాణ వార్డు మెంబర్స్‌ ఫోరం జిల్లా కన్వీనర్‌గా మర్పల్లి మండలం పంచలింగాల గ్రామానికి చెందిన విజయ్‌కుమార్‌ ఎన్నికయ్యారు. రాష్ట్ర ఉప సర్పంచ్‌లు, వార్డు మెంబర్ల ఫోరం వ్యవస్థాపకులు బొట్ల కార్తీక్‌ చేతుల మీదుగా నియామక పత్రం అందుకున్నారు. ఈ సందర్భంగా శనివారం వికారాబాద్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో కార్తీక్‌ మాట్లాడుతూ.. స్థానిక సంస్థల బలోపేతం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం తమ ఫోరం పనిచేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ వార్డు మెంబర్ల ఫోరం గౌరవ అధ్యక్షుడు కనకమామిడి విష్ణు, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఇన్‌చార్జ్‌ ప్రశాంత్‌, వివిధ గ్రామాల వార్డు మెంబర్లు తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వ ఆస్పత్రి వద్ద

అల్పాహారం పంపిణీ

తాండూరు: మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పట్లోళ్ల నీరజాబాల్‌రెడ్డి దంపతులు శనివారం తాండూరులోని ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రి, మాతాశిశు ఆస్పత్రి ఆవరణలో పేదలు, రోగులకు అల్పా హారం పంపిణీ చేశారు. ఈనెల 5న ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి పుట్టిన రోజు ఉందని, ఆయన అమెరికా పర్యటనలో ఉన్నందున ముందస్తు వేడుకలు నిర్వహిస్తున్నామని తెలిపారు.

పట్నంకు పైలెట్‌ పరామర్శ

తాండూరు: తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్‌రెడ్డి.. శనివారం శాసన మండలి చీఫ్‌ విప్‌ పట్నం మహేందర్‌రెడ్డి, కొడంగల్‌ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డిలను పరామర్శించారు. అనంతరం మహేందర్‌రెడ్డి తల్లి రుక్కమ్మ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు.

యువకుడికి విద్యుత్‌ షాక్‌

తాండూరు: రోడ్డు దాటుతున్న యువకుడు విద్యుత్‌ షాక్‌కు గురయ్యాడు. సైకిల్‌ టైర్‌ సహాయంతో బయట పడ్డాడు. ఈ ఘటన తాండూరు పట్టణంలో శనివారం చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. పెద్దేముల్‌ మండలం జనగాం గ్రామానికి చెందిన నవీన్‌ తాండూరులోని అంబేడ్కర్‌ చౌక్‌ సమీపంలో గల అపోలో ఫార్మసీలో పని చేస్తున్నాడు. శనివారం సాయంత్రం బహిర్భుమికి వెళ్లే క్రమంలో రోడ్డు దాటుతుండగా డివైడర్‌ మధ్యలో ఉన్న విద్యుత్‌ స్తంభాన్ని తాకాడు. దీంతో ఒక్కసారిగా షాక్‌ కొట్టింది. గమనించిన యువకులు సైకిల్‌ టైర్‌ సాయంతో నవీన్‌ను పక్కకు నెట్టేశారు. దీంతో ప్రాణాపాయం తప్పింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement