ఆపరేషన్ ద్వారా తొలగించిన వినాయక ఆస్పత్రి వైద్య బృందం
తాండూరు: పట్టణంలోని వినాయక ఆస్పత్రిలో ఓ మహిళ కడుపు లోనుంచి పది కిలోల బరువున్న కణతిని తొలగించారు. తాండూరుకు చెందిన శశికళ కొంతకాలంగా తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతోంది. స్కానింగ్ నిర్వహించగా భారీ కణతి ఉన్నట్లు గుర్తించారు. ఆందోళనకు గురైన శశికళ కుటుంబ సభ్యులు శాంతినగర్ పార్క్ ఎదుట ఉన్న వినాయక ఆస్పత్రిలో సంప్రదించగా గైనకాలజిస్ట్ డాక్టర్ అమృత్, సర్జన్ అర్జున్, మత్తు వైద్యుడు హరీష్ బృందం అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో విజయవంతంగా ఆపరేషన్ పూర్తిచేశారు. శశికళ కడుపు లోనుంచి 10.06 కిలోల కణతిని తొలగించారు.


