జైల్‌భరోను జయప్రదం చేయండి | - | Sakshi
Sakshi News home page

జైల్‌భరోను జయప్రదం చేయండి

Aug 2 2026 7:20 AM | Updated on Aug 2 2026 7:20 AM

అనంతగిరి: కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్పొరేట్‌ విధానాలను నిరసిస్తూ ఈ నెల 10న చేపట్టనున్న జైల్‌భరో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సీఐటీయూ రాష్ట్ర సహాయ కార్యదర్శి పద్మ పిలుపునిచ్చారు. శనివారం వికారాబాద్‌ సీఐటీయూ జిల్లా కార్యాలయంలో జరిగిన ముఖ్య నాయకుల సమావేశంలో ఆమె మాట్లాడారు.కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పేద, మధ్య తరగతి ప్రజల సంక్షేమాన్ని, అభివృద్ధిని విస్మరిస్తుందని ఆరోపించారు. వ్యాపార వేత్తలకు లబ్ధిచేకూరే విధానాలను అవలంభిస్తోందని విమర్శించారు. ఈ విధానాలను ఉపసంహరించుకోవాలని సూచించారు. జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌, వెంకటయ్య, బుగ్గప్ప, రామకృష్ణ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement