పట్టణంలోని ఆలయ భూముల్లో నిర్మించిన షాపింగ్‌ కాంప్లెక్స్‌ల నిర్మాణాలు చర్చనీయాంశంగా మారాయి. ఆదాయవృద్ధి కోసం చేపట్టిన ఈ నిర్మాణాలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. | - | Sakshi
Sakshi News home page

పట్టణంలోని ఆలయ భూముల్లో నిర్మించిన షాపింగ్‌ కాంప్లెక్స్‌ల నిర్మాణాలు చర్చనీయాంశంగా మారాయి. ఆదాయవృద్ధి కోసం చేపట్టిన ఈ నిర్మాణాలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Jul 20 2026 7:41 AM | Updated on Jul 20 2026 7:41 AM

సోమవారం శ్రీ 20 శ్రీ జూలై శ్రీ 2026 8లోu

న్యూస్‌రీల్‌

సోమవారం శ్రీ 20 శ్రీ జూలై శ్రీ 2026

తాండూరు: దేవాలయ ప్రాంగణాలు, మాన్యాలు వ్యాపార కేంద్రాలుగా మారుతున్నాయి. గతంలో పచ్చని చెట్లు, ఆధ్యాత్మిక వాతావరణంతో వెల్లివిరిసిన ఈ ప్రాంతాల్లో షాపింగ్‌ కాంప్లెక్స్‌ నిర్మాణాలు చేపట్టారు. స్థానిక నాయకులు, దేవాదాయ శాఖ అధికారులు సంయుక్తంగా అక్రమాలకు పాల్పడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఎనిమిదేళ్ల క్రితం బస్వన్న కట్ట ప్రాంతంలో పూర్తయిన షాపింగ్‌ కాంప్లెక్స్‌, రెండేళ్ల క్రితం భావిగి భద్రేశ్వరాలయ ప్రాంగణంలో చేపట్టిన కాంప్లెక్స్‌ నిర్మాణాల్లో దుకాణాల ఏర్పాటు చేసుకునేందుకు స్థానికుల నుంచి రూ.లక్షల్లో వసూలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. కోర్టు నుంచి స్టే రావడంతో ఈ ప్రక్రియ నిలిచిపోయింది. ప్రస్తుతం పోట్లి మహరాజ్‌ ఆలయ ప్రాంగణంలోని చెట్లు, ఇళ్ల నిర్మాణాలను కూల్చి వ్యాపారుల నుంచి ఒక్కో దుకాణానికి రూ.పది లక్షల చొప్పున వసూళ్లు చేపట్టి నిర్మణాలు చేపట్టడం చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వ స్థలాలు కాపాడాల్సిన అధికారులే ప్రేక్షకపాత్ర వహిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

కోర్టు స్టేతో పనులకు బ్రేక్‌

భావిగి భద్రేశ్వర స్వామి జాతర ఉత్సవాల సమయంలో బాలాజీ మందిర్‌ ఎదుట ఖాళీ స్థలంలో పశువుల సంత నిర్వహించేవారు. 2017లో ఆలయాధికారులు, ఆలయ కమిటీ ప్రతినిధులు ఈ స్థలంలో 20 దుకాణాలతో షాపింగ్‌ కాంప్లెక్స్‌ నిర్మించారు. కాగా పట్టణానికి చెందిన కల్వ శంకర్‌ కుటుంబ సభ్యులు తమ స్థలంలో షాపింగ్‌ కాంప్లెక్స్‌ నిర్మించారంటూ కోర్టును ఆశ్రయించడంతో అప్పట్లో స్టే వచ్చింది. దుకాణాలు అప్పగించకపోవడం, డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భావిగి భద్రేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో నిర్మిస్తున్న కాంప్లెక్స్‌ పనులు అడ్డుకోవాలని ఆరు నెలల క్రితం వీరశైవ సమాజం ప్రతినిధులు న్యాయస్థానాన్ని ఆశ్రయించగా ఈ నిర్మాణాలను నిలిపివేస్తూ కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో దుకాణాల కోసం డబ్బులు చెల్లించిన 46 మంది బాధితులు ఆందోళన చెందుతున్నారు.

వివాదాస్పదంగా మారుతున్న షాపింగ్‌ కాంప్లెక్స్‌లు

నిర్మాణాలు నిలిపివేయాలంటూ కోర్టు స్టే

దుకాణాలు కేటాయించేందుకు డబ్బులు వసూలు చేశారని ఆరోపణలు

ఆందోళనలో బాధితులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement