ఇబ్రహీంపట్నం రూరల్: కబ్జాకు గురైన గ్రామకంఠ భూమిని ఇళ్ల స్థలాలకు కేటాయించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి పగడాల యాదయ్య డిమాండ్ చేశారు . మండల పరిధిలోని దండుమైలారం గ్రామంలో ఓ భూస్వామి గ్రామకంఠ భూమిని కబ్జా చేశాడని సోమవారం ఇబ్రహీంపట్నం ఆర్డీఓ శ్రీనివాస్‌రెడ్డిని కలిసిన సీపీఎం నాయకులు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా పగడాల యాదయ్య మాట్లాడుతూ.. దండుమైలారంలో కబ్జాకు గురైన నాలుగు ఎకరాల భూమిని ఇళ్ల స్థలాలకు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సామేలు, మండల కార్యదర్శి బుగ్గరాములు, జిల్లా నాయకులు జంగయ్య, జగన్, మండల కమిటీ సభ్యులు జంగయ్య, లింగస్వామి, నాయకులు యాదగిరి, రమేశ్, మల్లేశ్, జంగయ్య, లింగం తదితరులు పాల్గొన్నారు.
పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని డిమాండ్


