రీ సర్వే చేసి న్యాయం చేయండి | - | Sakshi
Sakshi News home page

రీ సర్వే చేసి న్యాయం చేయండి

Jul 21 2026 7:22 AM | Updated on Jul 21 2026 7:22 AM

యాచారం: గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద అంటించిన సర్వేనంబరు 127 అసైన్డ్‌ రైతులకు పట్టాదారు పాస్‌పుస్తకాల్లో ఉన్న భూ ఎకరాలు.. ప్రకటించిన జాబితాలో రాలేదని, రీ సర్వే చేపట్టాలని మొండిగౌరెల్లి రైతులు తహసీల్దార్‌ అయ్యప్పకు వినతిపత్రం అందజేశారు. సర్వేనంబరు 127లోని అసైన్డ్‌ రైతులు సోమవారం యాచారం తహసీల్దార్‌ కార్యాలయంలో తహసీల్దార్‌ను కలిసి కబ్జా అధికంగా ఉన్నప్పటికి, పట్టాదారు పాస్‌పుస్తకాల్లో ఉన్న ఎకరాలు మొత్తం జాబితాలో రాలేదని మళ్లీ రీ సర్వే జరిపి తమకు న్యాయం చేయాలని కోరారు. అనంతరం ఇబ్రహీంపట్నం ఆర్డీఓ శ్రీనివాస్‌రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఇందుకు ఆర్డీఓ సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ కొలన్‌ రమాదేవి, ఉప సర్పంచ్‌ బడే కుమార్‌, రైతులు పాల్గొన్నారు.

తహసీల్దార్‌, ఆర్డీఓలకు రైతుల వినతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement