రేపు కొడంగల్‌కు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి | - | Sakshi
Sakshi News home page

రేపు కొడంగల్‌కు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

Jul 20 2026 7:41 AM | Updated on Jul 20 2026 7:41 AM

రేపు కొడంగల్‌కు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వంట గ్యాస్‌ సబ్సిడీపై తప్పుడు ప్రచారం రైతులకు వడ్డీలేని రుణాలు అందించాలి

కొడంగల్‌/దుద్యాల్‌: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈనెల 21న కొడంగల్‌కు విచ్చేయనున్నట్లు కాంగ్రెస్‌ పార్టీ వర్గాలు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపాయి. మంగళవారం మధ్యాహ్నం హైదరాబాద్‌ నుంచి హెలీకాఫ్టర్‌లో బయలుదేరి కొడంగల్‌కు చేరుకుంటారు. అక్కడ నుంచి రోడ్డు మార్గంలో హకీంపేటకు వెళ్లి అభివృద్ధి పనులను పరిశీలిస్తారు. దుద్యాల మండలం హకీంపేట, లగచర్ల, పోలేపల్లి శివారులో ఎడ్యూకేషన్‌ హబ్‌ నిర్మాణాల పనుల పురోగతిపై అధికారులకు దిశా నిర్దేశం చేస్తారు. అనంతరం రాత్రికి కొడంగల్‌కు చేరుకొని ఆయన నివాసంలో బస చేస్తారు. బుధవారం ఉదయం సర్‌ కార్యక్రమంపై కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలకు అవగాహన కల్పిస్తారు.

సీపీఎం జిల్లా కార్యదర్శి మహిపాల్‌

బంట్వారం: ఎన్నికల సమయంలో మహాలక్ష్మి పథకంలో భాగంగా వంట గ్యాస్‌ సబ్సిడీ ఇస్తామని చెప్పిన హామీ ఏమైందని సీపీఎం జిల్లా కార్యదర్శి ఆర్‌.మహిపాల్‌ ప్రభుత్వాన్ని నిలదీశారు. ఆదివారం కోట్‌పల్లి మండలంలోని ఓగులాపూర్‌లో ఐద్వా మహిళా సంఘం ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరైన మహిపాల్‌ మాడ్లాడుతూ.. పాలకులు సబ్సిడీపై వంట గ్యాస్‌ ఇస్తున్నామని తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. ఎక్కడ ఇస్తున్నారో చూపాలని ప్రశ్నించారు. ప్రభుత్వం ఇప్పటికై నా ఆరు గ్యారంటీల అమలుకు కృషి చేయాలన్నారు. నిత్యావసర ధరల నియంత్రణలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయన్నారు. రేషన్‌ దుకాణాల్లో నాణ్యమైన బియ్యం పంపిణీ చేయాలని డిమాండ్‌ చేశారు. అధికారం కోసం అడ్డగోలు హామీలిచ్చిన వారికి తగిన సమయంలో ఓటుతో గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఐద్వా మహిళా సంఘం జిల్లా కార్యదర్శి అనసూయ, సభ్యులు మాణెమ్మ, బాల మ్మ, అమృతమ్మ, లక్ష్మి, అంతమ్మ, తుల్జమ్మ, సంధ్య, రేణుక, అంజమ్మ పాల్గొన్నారు.

రైతు సంఘం జిల్లా కార్యదర్శి

సురేశ్‌కుమార్‌

కొడంగల్‌ రూరల్‌: రాష్ట్రంలో వర్షాలు కురవక రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని రైతు సంఘం జిల్లా కార్యదర్శి గంటి సురేశ్‌కుమార్‌ ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ఆధ్వర్యంలో మూడు రోజులపాటు నిర్వహించే శిక్షణ తరగతులు యాదగిరిగుట్ట పట్టణంలో ఆదివారం ప్రారంభమయ్యాయి. రైతు సంఘం నాయకులకు, కార్యకర్తలకు శిక్షణ తరగతులు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల రుణాలను పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్‌ చేవారు. వర్షాలు లేక పంటలు పండే పరిస్థితులు లేనందున రైతులకు వడ్డీలేని రుణాలను అందించాలని కోరారు.

దివ్యాంగుల సంక్షేమానికి పెద్దపీట

మొయినాబాద్‌: దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని రాష్ట్ర దివ్యాంగుల కార్పొరేషన్‌ చైర్మన్‌ ముత్తినేని వీరయ్య అన్నారు. మున్సిపల్‌ పరిధిలోని చిలుకూరు రెవెన్యూలో ఉన్న ఓంశాంతి నిలయంలో ఆదివారం కాంగ్రెస్‌ దివ్యాంగుల విభాగం ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు ప్రారంభించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. దివ్యాంగుల కోసం కాంగ్రెస్‌ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందని తెలిపారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పదేళ్ల పాలనలో ఏ మాత్రం గుర్తించలేదని విమర్శించారు. కార్యక్రమంలో పీసీసీ సభ్యుడు షాబాద్‌ దర్శన్‌, దివ్యాంగుల విభాగం నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement