26 దుకాణాలపై ఉత్కంఠ
ఆలయాల భూములకు
పోట్లి మహరాజ్ ఆలయ ప్రాంగణంలో నిర్మిస్తున్న దుకాణ సముదాయం
రెండెకరాల్లో పొట్లీ మహరాజ్ ఆలయ ప్రాంగణం విస్తరించి ఉంది. గతంలో పాఠశాల భవనం నిర్మించారు. రెండు నెలల క్రితం ఆలయ ప్రాగణంలోని చెట్లు, పేద కుటుంబాలు నివసిస్తున్న ఇళ్లను కూల్చేసి 26 దుకాణాల ఏర్పాటుకు నిర్మాణ పనులు ప్రారంభించారు. ఇక్కడ ఒక్కో దుకాణం కోసం రూ.పది లక్షల నుంచి రూ.15లక్షల వరకు వసూలు చేసినట్లు ఆరోపణలున్నాయి. ఈ ఆలయంలో నిర్మిస్తున్న దుకాణాలు వ్యాపారుల చేతికి అందుతాయా.. లేదంటే న్యాయపరమైన చిక్కులతో నిలిచిపోతాయా అనే ఉత్కంఠ నెలకొంది.


