ఎన్నికల ముందే హామీలు యాదికొస్తాయ్‌  | YS Sharmila comments on CM KCR | Sakshi
Sakshi News home page

ఎన్నికల ముందే హామీలు యాదికొస్తాయ్‌ 

Aug 4 2023 6:17 AM | Updated on Aug 4 2023 4:06 PM

YS Sharmila comments on CM KCR - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: దేశంలో ముఖ్యమంత్రులు ప్రమాణ స్వీకారం తర్వాత హామీలు నెరవేరిస్తే, దొర గారికి మాత్రం ఎన్నికల ముందే హామీలు యాదికొస్తాయని వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల విమర్శించారు. నాలుగున్నరేళ్లుగా గడీల్లో కుంభకర్ణుడిలా మొద్దు నిద్ర పోయిన సీఎం కేసీఆర్‌ ఓట్ల కోసం అటక మీద దాచిన మేనిఫెస్టో తిరగేస్తున్నారని అన్నారు. ఈ మేరకు గురువారం షర్మిల ట్వీట్‌ చేశారు. రైతులను ఓట్లు అడిగేందుకు మొహం చెల్లక రుణమాఫీ చేస్తానంటూ.. నవంబర్‌లో నిర్వహించాల్సిన మద్యం టెండర్లను మూణ్ణెల్ల ముందే ముంగటేసుకున్నారని దుయ్యబట్టా రు. కరోనా సమయంలోనూ రాష్ట్రం ఆర్థికంగా దూసుకెళ్లిందని, నిధుల కొరత లేదని ఇన్నా ళ్లూ గప్పాలుకొట్టిన దొర ఎన్నికలకోసం డబ్బు ను పోగు చేసుకుంటున్నారని విమర్శించారు. ఔటర్‌ రింగ్‌ రోడ్డును రూ.7 వేల కోట్లకే లీజుకిచ్చారని, ప్రభుత్వ భూములను యథేచ్చగా అమ్ముకుంటున్నారని ఆరోపించారు.  

Advertisement
 
Advertisement
Advertisement