ఫోన్‌ మాట్లాడేందుకు టెర్రస్‌ పైకి వెళ్లి.. | Young Woman Dies After Falling From The Fifth Floor On Miyapur Hyderabad, Check More Details Inside | Sakshi
Sakshi News home page

ఫోన్‌ మాట్లాడేందుకు టెర్రస్‌ పైకి వెళ్లి..

Jun 23 2026 12:11 PM | Updated on Jun 23 2026 12:49 PM

Young Woman Dies After Falling From The Fifth Floor On Miyapur Hyderabad

ప్రాణమ్య (ఫైల్‌) 

మియాపూర్‌:  మియాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఓ యువతి ఐదో అంతస్తుపైనుంచి పడి మృతి చెందింది.  పోలీసులు తెలిపిన మేరకు.. శ్రీకాకుళం జిల్లా చెందిన బుద్ధ వెంకటప్రతాప్‌ రెడ్డి–ప్రశాంతి దంపతులు అమెరికాలో ఉంటున్నారు. తల్లి ప్రశాంతితో కలిసి కుమార్తె బుద్ధ శ్రీ ప్రాణమ్య (20)  ఇటీవల మయూరీ నగర్‌లోని బొమ్మరిల్లు అపార్ట్‌మెంట్‌లో ఉంటున్న అమ్మమ్మ ఇంటికి వచ్చారు. 

సోమవారం మధ్యాహ్నం ప్రాణమ్య ఫోన్‌ మాట్లాడేందుకు టెర్రస్‌ పైకి వెళ్లి గోడకు ఆనుకొని ఉండగా అదుపు తప్పి కిందపడింది. వాచ్‌మెన్‌ సమాచారం ఇవ్వడంతో తల్లి ప్రశాంతి  కూతురిని ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించగా అప్పటికే  మృతి చెందినట్లు ధృవీకరించారు. ప్రాణమ్య డిగ్రీ ఆన్‌లైన్‌లో చదువుతోంది.   మృతురాలి తల్లి ప్రశాంతికి స్థానికంగా ఓ ఫ్లాట్‌ ఉందని.. రెండు మూడు రోజుల్లో అక్కడికి వెళ్లాల్సి ఉందని స్థానికులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement