ఫేస్‌బుక్‌లో వల.. సహజీవనం తర్వాత అసలు రంగు! | Woman Defrauded After Meeting Someone On Facebook | Sakshi
Sakshi News home page

ఫేస్‌బుక్‌లో వల.. సహజీవనం తర్వాత అసలు రంగు!

Jun 11 2026 1:39 PM | Updated on Jun 11 2026 2:43 PM

Woman Defrauded After Meeting Someone On Facebook

మేడిపల్లి: వివాహం చేసుకుంటానని నమ్మించి ఓ మహిళతో సహజీవనం చేసి, ఆపై  రూ.40 లక్షల నగదు, రెండున్నర తులాల బంగారం తీసుకొని మోసం చేసిన సంఘటన మేడిపల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు.. బోడుప్పల్‌ ఉదయ్‌ నగర్‌కు చెందిన ఒక మహి భర్తతో  విభేదాల కారణంగా కొన్నేళ్లుగా వేరుగా నివసిస్తోంది.

2019లో ఫేస్‌బుక్‌ ద్వారా అస్సాంలో విధులు నిర్వహిస్తున్న షేక్‌ మహబూబ్‌ హుస్సేన్‌ పరిచయమయ్యాడు. అది కాస్తా ప్రేమగా మారింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించడంతో ఆమె అతనితో కలిసి బోడుప్పల్‌లో సహజీవనం చేసింది. అయితే, గత ఏడాది కాలంగా మహబూబ్‌ హుస్సేన్‌ మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నట్లు బాధితురాలు గుర్తించింది.

ఈ విషయంపై అతడిని ప్రశ్నించగా సరైన సమాధానం ఇవ్వలేదు. పెళ్లి పేరుతో తన వద్ద నుండి రూ.40 లక్షల నగదు, రెండున్నర తులాల బంగారం తీసుకుని మోసం చేశాడని ఆరోపించింది. నిందితుడి కుటుంబ న్యాయవాది కూడా తనకు పలుమార్లు ఫోన్‌ చేసి బెదిరింపులకు గురిచేశాడని తెలిపింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు మేడిపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement