ఆదిలాబాద్ రిమ్స్‌లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. షార్ట్‌సర్క్యూట్‌తో పిల్లల వార్డులో ఏసీ పేలింది. ఒక చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. ప్రమాద సమయంలో వార్డులో 27 మంది చిన్నారులు ఉన్నారు. దట్టంగా పొగ అముముకోవడంతో పలువురు అస్వస్థతకు గురయ్యారు.
అస్వస్థతకు గురైన పిల్లలను వేరే ఆసుపత్రికి తరలించారు. అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టింది. రిమ్స్‌కు కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్ చేరుకున్నారు. అక్కడి పరిస్థితిపై సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు.


