కై లాస్‌నగర్: ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలని కొందరు.. ఉపాధి కల్పించాలని ఇంకొందరు.. భూసమస్యలు పరిష్కరించాలని మరికొందరు.. ఇలా వివిధ సమస్యలతో వచ్చిన బాధితులు కలెక్టర్ రాజర్షి షాకు మొరపెట్టుకున్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్‌లో జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన బాధితులు బారులు తీరి అర్జీలు సమర్పించారు. వారి సమస్యలను సావధానంగా ఆలకించిన కలెక్టర్ దరఖాస్తులను సంబంధిత అధికారులకు అందజేస్తూ త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు ఎస్.రాజేశ్వర్, ఆర్‌ఎస్.చిత్రు, డీఆర్వో స్రవంతి, జెడ్పీ సీఈవో రవి, డీఆర్డీవో రవీందర్ రాథోడ్ తదితరులు పాల్గొన్నారు. ఈ వారం అర్జీదారుల్లో కొందరి నివేదన.


