యాసంగి సాగుపై ప్రభావం
రైతులకు ప్రత్యామ్నాయ పాఠాలు
‘ఆరుతడి’ మేలంటున్న వ్యవసాయ శాఖ
జొన్న, మొక్కజొన్న బదులు శనగ, పశుగ్రాసం ప్రణాళిక
సాక్షి,ఆదిలాబాద్: ఎల్‌నినో సవాలు విసురుతుంది. వర్షాభావం కారణంగా యాసంగిలో ఎలా ముందుకెళ్లాలో అనే విషయంలో రైతుల్ని ఆలోచనలో పడేసింది. వ్యవసాయ శాఖ కూడా ఏదైనా ప్రణాళిక రూపొందించి ముందుకెళ్దామా.. ఈ మిగిలిన రోజు ల్లో వాతావరణ పరిస్థితుల్లో ఏదైనా మార్పు చోటుచేసుకొని వర్షాలు అనుకూలంగా కురిస్తే, ఆ తర్వాత ఆలోచిద్దామా..అనేవిషయంలో అధికారులు కూడా వెనుకాముందువుతున్నారు. అయినా 15 రోజుల త ర్వాత యాసంగిలో రైతులు నీటిఎద్దడి తట్టుకునే పంటలు సాగు చేసేలా చైతన్యపర్చేందుకు ప్రచా రం నిర్వహించాలని యోచిస్తున్నారు.
జిల్లాలో ఇదీ పరిస్థితి..
జిల్లాలో ఏటా యాసంగిలో జొన్న, మొక్కజొన్న, శనగ, గోధుమ, ధనియా, వేరుశనగ వంటి పంట లు సాగవుతాయి. ఇందులో జొన్న, మొక్కజొన్న అత్యధికంగా సాగవుతాయి. మిగతావి నామమాత్రంగా ఉంటాయి. ఈ రెండు పంటలకు నీటి తడులు అధికంగా అందించాల్సి ఉంటుంది. ఎల్‌నినో దెబ్బతో జిల్లాలో వర్షాభావం నెలకొంది. భూగర్భ జలాలు ప్రస్తుతం పర్వా లేకున్నా, రానున్న రోజుల్లో తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో సాధారణంగా సాగు చేసే పంటల్లో శనగ అధికంగా సాగు చేయాలని వ్యవసాయ శాఖ రైతులకు సూచించేందుకు సిద్ధమవుతుంది. ప్రధానంగా సాధారణ తడులతో పాటు పొగమంచు కారణంగా శనగ సాగైపోతుంది. దీనికి పెద్దగా నీటి తడులు అందించాల్సిన అవసరం ఉండదు. అలాగే వచ్చే వేసవిలో పశుగ్రాసం కొరత తీవ్రంగా ఉంటుందని అధికారులు ఆలోచిస్తున్నారు.
శనగ సాగు ప్రోత్సహిస్తాం
యాసంగిలో జిల్లాలో సాధారణంగా జొన్న సాగు అధికంగా ఉంటుంది. ఈసారి వర్షాభావ పరిస్థితుల కారణంగా శనగ సాగు పెంచాలని రైతులకు సూచి స్తున్నాం. ఈ దిశగా వారిని చైతన్యపర్చేందుకు కృషి చేస్తున్నాం. అలాగే కలెక్టర్ ఆదేశాల మేరకు పశుగ్రాసం పెంచాలని ప్రోత్సహిస్తున్నాం.
– రవీందర్ సింగ్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి


