ఆయా మండలాల్లోని ఆదివాసీలతో పాటు ఇతర గ్రామాల్లోని ప్రజానీకం తమ అవసరాల నిమిత్తం ముండల కేంద్రాలకు వెళ్లక తప్పని పరిస్థితి. సరైన రోడ్లు లేని కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా గర్భిణులు, బాలింతలు, హర్ట్‌ఎటాక్, పిట్స్ వంటి అత్యవసర పరిస్థితుల్లో బాధితులను ఆసుపత్రికి తీసుకెళ్లడం కుటుంబీకులకు కష్టతరంగా మారుతుంది. గుంతలమయమైన, కాలిబాట రోడ్లపై అంబులెన్స్, కనీసం ద్విచక్రవాహనం వెళ్లలేని పరిస్థితి. సాధారణ పనులతో పాటు అత్యవసరంలోనూ రోడ్లపై ప్రయాణం నరకప్రాయంగా మారుతోంది. ఈ పరిస్థితుల్లో వారిని ఆసుపత్రులకు చేర్చేలోపే మరణాలు సంభవిస్తున్నాయి. ఇటీవల ఓ గర్భిణితో పాటు ప్రసవంలో శిశువు మరణించడం రోడ్ల దుస్థికి అద్దం పడుతుంది. దారిలోనే ప్రాణాలు గాలిలో కలుస్తున్నా పట్టించుకునే నాథుడు కరువయ్యారంటూ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


